కమల్ హాసన్ అంటేనే తెలుగు సినీ పరిశ్రమలో ఒక లెజెండ్. decades of cinematic excellence తో ఆయన సినిమా రంగంలో తనదైన ఒక ప్రదేశం సంపాదించారు. కమల్ హాసన్ తీసుకునే ప్రతీ నిర్ణయం, ఒక్కో ప్రాజెక్ట్ కాబట్టి ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఇపుడు ఆయన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ సంబంధించి తీసుకున్న ఓటిటి విడుదల నిర్ణయం సినిమాపై ఉత్సుకత పెంచటమే కాదు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆ నిర్ణయం ఏమిటి..

తాజాగా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ దగ్ లైఫ్ థియేటర్ రన్ మొదలైన 8 వారాల తర్వాతే ఓటిటిలో వస్తుందని, ఆ మేరకు సదరు సంస్థతో కూర్చుని తాము చేసిన చర్చలు మంచి ఫలితాన్ని ఇచ్చాయని అన్నారు. ఇకపై మిగిలిన వాళ్ళు కూడా ఇదే ఫాలో అయితే ఇండస్ట్రీకి మరిన్ని మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కమల్ ప్రకటించినట్లుగా, ‘థగ్ లైఫ్’ సినిమాను థియేటర్‌లో విడుదలైన తర్వాత కనీసం ఎనిమిది వారాలు పూర్తయ్యే వరకు డిజిటల్ స్ట్రీమింగ్ ఆప్షన్ అందుబాటులో ఉండబోదు. హిందీ మల్టీప్లెక్స్లు కూడా, థియేటర్ రిలీజ్ నుంచి ఆరు వారాల కంటే ముందుగా ఓటిటి స్ట్రీమింగ్ అనుమతించడంలేదు. అందుకే కమల్, ఆయన టీమ్ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.

, ,
You may also like
Latest Posts from