యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “డ్రాగన్”. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ముఖ్యమైన పాటను తెరకెక్కించినట్టు సమాచారం. ఈ పాట కథలో కీలక సమయంలో వచ్చే ఎమోషనల్ సీన్‌లో భాగంగా ఉంటుందని టాక్.
ఇక తాజా సమాచారం ప్రకారం, డ్రాగన్ సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా స్క్రిప్ట్ ఓసారి లాక్ అయిపోయిన తర్వాత దానిపై మళ్లీ పెద్దగా మార్పులు చేయని ప్రశాంత్ నీల్ – ఈసారి మాత్రం ఎన్టీఆర్ సూచనలు, సినిమా రేంజ్ దృష్టిలో పెట్టుకొని, కథను మరింత పక్కాగా తీర్చిదిద్దేందుకు స్క్రిప్ట్‌పై మళ్లీ రీ–వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది.
షెడ్యూల్ గ్యాప్ వచ్చిన సమయంలో ప్రశాంత్ నీల్ తిరిగి రైటింగ్ టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌ను ఫైన్ ట్యూన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ కూడా రైటింగ్ దశ నుంచే ఈ ప్రాజెక్ట్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నట్టు సమాచారం.
కాగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన “సలార్” కమర్షియల్ హిట్టయినప్పటికీ కథాపరంగా కొన్ని విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి “డ్రాగన్” విషయంలో ఎలాంటి తడబాటు లేకుండా, స్క్రిప్ట్ స్థాయిలోనే మెరుగులు దిద్దుతున్నారు.
ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట అంటున్నారు – “అంతిమంగా బెటర్ అవుట్‌పుట్ వస్తే చాలు!” . “డ్రాగన్” చిత్రంపై వచ్చే అప్‌డేట్స్ కోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.