ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). భారీ అంచనాల మధ్య రానున్న ఈ మూవీ రిలీజ్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ప్యాన్ ఇండియా మార్కెట్ లో ప్రబాస్ కు ఓ టెస్ట్ గా మారనుంది ఈ సినిమా.

ప్రభాస్‌ మొదటిసారి హారర్‌ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి దృష్టి ‘ది రాజాసాబ్‌’ పైనే ఉంది. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌, సంజయ్‌దత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్‌లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి.

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఇప్పుడు ఓ సాధారణ సినిమా కాదు — అతని పాన్-ఇండియా స్టార్డమ్‌కు రియల్ టెస్ట్ గా మారుతోంది. ఈ సినిమా టైగర్ 3 డే 1 కలెక్షన్ అయిన ₹45 కోట్లు (హిందీలో)ను బీట్ చేస్తేనే ప్రభాస్ మొదటిసారి హిందీ ఓపెనింగ్స్ టాప్ 10లోకి అడుగు పెట్టగలడు.

అలాగాకపోతే?
అప్పటివరకు 8వ సినిమా కూడా హిందీలో టాప్ 10కు చేరకపోవడమే అవుతుంది. ఇది ప్రభాస్‌కు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్‌పై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది.

‘కన్నప్ప’ క్యామియో కూడా సహకరించలేదు

ఇటీవల ప్రభాస్ కనిపించిన ‘కన్నప్ప’ సినిమాలో చిన్న క్యామియో కూడా బాక్సాఫీస్‌లో హిందీ మార్కెట్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. ఆ సినిమా హిందీలో ₹5 కోట్లను కూడా తెచ్చుకోలేకపోయింది. ఇది అతని హిందీ మార్కెట్ క్రేజ్ ఎంత తగ్గిపోయిందో చూపుతోంది.

ఫైనల్‌గా…

ఒకప్పుడు బాహుబలి ప్రభాస్ ను బాలీవుడ్ స్టార్‌లకు సీరియస్ రైవల్ అనుకునే రోజులు వచ్చాయి. కానీ ఇప్పుడు అతని స్థానం కొనసాగించాలంటే… ఒక బలమైన హిందీ హిట్ తప్పనిసరి.

ఇది ప్రభాస్ పాన్-ఇండియా స్టార్డమ్‌కి వచ్చే మళ్లీ పట్టం కడతుందా లేక సవాలు పెంచుతుందా అన్నది తేల్చే క్రైటికల్ సినిమా!

, , , , ,
You may also like
Latest Posts from