కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘కూలీ’. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నుంచి ఇప్పటికే చికిటు, మోనికా అంటూ సాగే రెండు పాటలను విడుదల చేశారు. మోనికా సాంగ్‌తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ నేపధ్యంలో ఈ సినిమాగురించి రోజుకే అప్డేట్ వచ్చి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అలాంటి ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చదవబోతున్నారు.
తమిళ మీడియాలో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం, సినిమాలోని కథనానికి కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారట. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన టీమ్ తో కలిసి కమల్ ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. కథను కమల్ గొంతులో వినిపిస్తూ నెరేటివ్ స్టైల్లో నడిపించనున్నారట. అన్ని కుదిరితే, ఆయన వచ్చే వారం వాయిస్ రికార్డింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో టాప్‌లో ఉంది రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’. IMDb లిస్ట్‌లో కూడా ఇది అత్యంత వేచి చూడబడిన భారతీయ సినిమాగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోంది.
తాజాగా కూలీ మూవీ ప్రమోషన్లలో భాగంగా థర్డ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. పవర్ హౌస్ అంటూ సాగే పవర్‌ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పవర్‌ఫుల్ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. వచ్చేనెల ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.