తమిళ స్టార్ హీరో ధనుష్‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిన ‘రాంఝనా’ సినిమా రీసెంట్‌గా రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చిందన్న ఆనందం కంటే… క్లైమాక్స్‌ మారిందన్న బాధ ధనుష్‌ను గుండెల్లో బరువెక్కేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే…

ధనుష్, సోనమ్ కపూర్, అభయ్ డియోల్ ప్రధాన పాత్రల్లో, ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన రాంఝనా 2013లో ఘనవిజయం సాధించింది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాను ఆగస్టు 1న రీరిలీజ్ చేశారు. కానీ ఈసారి ప్రేక్షకులు చూసింది అదే కథ కాదు… ఏఐ తో తయారు చేసిన కొత్త ముగింపు!

“నా సినిమాలో నా గుండె తీసేసారు!” – ధనుష్ ఆవేదన

AI టూల్స్ సాయంతో మేకర్స్ క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చడం పట్ల ధనుష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆయన విడుదల చేసిన స్టేట్‌మెంట్ లోని పదాలు చర్చనీయాంశంగా మారాయి. ఇది ఆ సినిమా ఆత్మనే కోల్పోయేలా చేసిందని పేర్కొన్నారు. ఇందుకు తాను అభ్యంతరం తెలిపినప్పటికీ సంబంధిత పార్టీలు ఈ విషయంలో ముందుకెళ్లాయంటూ ‘ఎక్స్‌’లో ఆవేదన వ్యక్తం చేశారు.

12 ఏళ్ల క్రితం తాను కమిట్‌ అయిన సినిమా ఇది కాదని తెలిపారు. సినిమాల్లో కంటెంట్‌ను మార్చడానికి ఏఐని ఉపయోగించడం కళ, కళాకారులు.. ఇద్దరికీ తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఇది కథ చెప్పే విధానానికి, సినిమా వారసత్వానికి ప్రమాదకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులను నివారించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒక వైపు టెక్నాలజీ పురోగమిస్తోంది… మరోవైపు కళాకారుల భావోద్వేగాలు చీలిపోతున్నాయి. ధనుష్ ఆవేదన ఈ కొత్త యుగానికి బలయ్యే నటన అనే భావాన్ని తిరిగి తెరమీదికి తెస్తోంది. ఇది కేవలం సినిమా కథ కాదు – నటుడి మనస్సును తాకిన మార్పు కథ. ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే… భవిష్యత్తులో మనం చూసే సినిమాలు నిజంగా ఆర్ట్‌ తో తయారయినవా? లేక ఆర్టిఫిషియల్‌ వా?

ధనుష్‌, బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ జంటగా దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2013లో విడుదలై, మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ‘రీ-రిలీజ్‌’ ట్రెండ్‌లో భాగంగా ఆగస్టు 1న మరోసారి బాక్సాఫీసు ముందుకొచ్చింది. ఒరిజినల్‌ క్లైమాక్స్‌ను మార్చి, ఏఐ సాయంతో రూపొందించిన క్లైమాక్స్‌ను యాడ్‌ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

, , , ,
You may also like
Latest Posts from