బాక్సాఫీస్‌పై బిగ్ వార్ మొదలయ్యే సమయం దగ్గర పడుతోంది! ఒకవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ మాస్ మాస్ అవతారంలో కనిపించనున్న ‘కూలీ’, మరోవైపు హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలయికలో యాక్షన్ ఫైర్ వర్క్స్‌తో రాబోతున్న ‘వార్ 2’. రెండు సినిమాలూ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ఏది హిట్ అవుతుంది? ఏది ఫట్ అవుతుంది? ఏది రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది? ఏది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటుంది? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. కొంతమంది పోల్స్ పెట్టి మూడ్ గేజ్ చేస్తున్నారంటే, ఇంకొంతమంది తమ అభిప్రాయాలు స్పష్టంగా షేర్ చేస్తున్నారు.

‘కూలీ’ పై అయితే మరింతగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది రజినీ కెరీర్‌లో మరో మాస్ మైలురాయి అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. శృతిహాసన్, నాగార్జున లాంటి స్టార్స్ భాగమవడం సినిమాకు అదనపు బలంగా మారింది. డైరెక్టర్ లొకేష్ కనగరాజ్ మాస్-స్టైల్ సైగ్నేచర్‌ను ‘కూలీ’లో ఎలా అందించబోతున్నాడన్నది హైప్ తో కూడుకున్న అంశం. ఈ నేపధ్యంలో రెండు సినిమాల రన్ ఎలా ఉండబోతోందో, అడ్వాన్స్ బుకింగ్స్ ఏ సినిమా దూసుకెళ్తోందో, ఎక్కడెక్కడ ఏ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో – ఇప్పుడు చూద్దాం.

కూలీ vs వార్ 2 – ముందస్తు బుకింగ్స్‌లో టాప్?

అడ్వాన్స్ బుకింగ్స్‌ ట్రెండ్స్ ను గమనిస్తే, ‘కూలీ’ స్పష్టంగా దూసుకెళ్తోంది. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో కూలీకి మాస్ హంగామా మొదలైపోయింది. తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. లొకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా స్టైల్, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ‘వార్ 2’ విషయానికి వస్తే, ఇది యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో మరో భారీ చాప్టర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో, హృతిక్-ఎన్టీఆర్ కాంబో చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. హిందీ బెల్ట్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ‘వార్ 2’కి మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పడం, హృతిక్‌తో స్క్రీన్ షేర్ చేయడం సినిమాకు అదనపు బలంగా మారాయి.

ఎవరు గెలుస్తారో..? వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం

రెండు చిత్రాలు వేర్వేరు ఏరియాల్లో తమదైనగా మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఓవర్సీస్ మార్కెట్, తెలుగు స్టేట్స్, నార్త్ ఇండియా, సౌత్ స్టేట్స్ – ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ రెండు సినిమాలు పంచుకుంటాయి. అయితే ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను డిసైడ్ చేయేది ప్రేక్షకుల మౌత్ టాక్ మాత్రమే.

ప్రస్తుతం మాత్రం, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ‘కూలీ’ స్పష్టంగా ముందంజలో ఉంది. కానీ ఫైనల్ గేమ్ విన్నర్ ఎవరో ప్రేక్షకుల రెస్పాన్స్ తోనే తేలుతుంది.

, , , , , , , , ,
You may also like
Latest Posts from