మాస్ అనగానే రవితేజ వెంటనే గుర్తు వచ్చేస్తాడు! రవితేజ అంటేనే తెరపై మాస్‌ మహారాజా — ఈసారి కూడా అదే ఫార్ములా ఫుల్ లోడ్‌ అయ్యి వస్తోంది. టైటిల్‌కే “మాస్ జాతర” అంటే, కంటెంట్ ఏంటో ముందే హింట్‌ ఇచ్చేశారు అన్నమాట. ఫస్ట్ లుక్ తోనే బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీకి, ఇప్పుడు టీజర్ ఫుల్ పటాసులు పేల్చేసింది.

భాను భోగవరపు దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి ఈనెల 27న విడుదల అవుతున్న ఈ చిత్రం… ఓ మాటలో చెప్పాలంటే, రవితేజ మాస్ విందు. కొత్త కథలా ఏమీ కాకపోయినా, హీరో ఇన్‌ట్రో షాట్స్, బిల్డ‌ప్ డైలాగులు, పంచ్ కట్స్ అన్నీ ఫ్యాన్స్ కోసం మిక్స్ చేసిన స్పెషల్ బిర్యానీలా ఉన్నాయి.

ఈసారి రవితేజ రైల్వే పోలీస్. “క్రాక్”లోని సీరియస్ పోలీస్ కంటే, ఇక్కడ మాత్రం స్మార్ట్, చిలిపి, తిక్క రైల్వే పోలీస్. శ్రీలీలతో రొమాన్స్, ఫైట్‌ల్లో హాస్యం, ఎంట్రీలో పంచ్ — ఇవన్నీ అతని సిగ్నేచర్‌ స్టైల్లోనే. భీమ్స్ అందించిన సాంగ్స్ ఇప్పటికే వైరల్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే హీరోయిజాన్ని పెంచి, సీన్‌కి కరెంట్‌ పోసినట్టుంది.

క్లైమాక్స్‌లో రాజేంద్ర ప్రసాద్ మోఖంలో “అడ్రస్ పెట్టు” అని వచ్చే డైలాగ్… మీమ్స్ లవర్స్‌కి డైరెక్ట్ హిట్. అయితే, ఇప్పటి హాట్ మీమ్స్ వాడితే మరీ వైరల్ అయ్యేదేమో అన్న ఫీలింగ్ తప్పదు. మొత్తానికి, మాస్ మస్తీ, మీమ్ మేజిక్, రవితేజ ఎనర్జీ — ఇవన్నీ కలిపిన ఫుల్ జాతర.

, , ,
You may also like
Latest Posts from