వరుస విజయాలతో కెరీర్‌లో గోల్డెన్ ఫేజ్ ని ఆస్వాదిస్తున్న నాని, చేసిన సినిమాల్లో ఒక్కటీ పెద్దగా ఫ్లాప్ కాకపోవడంతో పాటు, అన్ని ప్రాంతాల్లోనూ మంచి ఓపెనింగ్స్ సాధిస్తున్నాడు. దీనికి నాని చేసే స్క్రిప్ట్‌ సెలక్షన్‌ ముఖ్య కారణం.

ప్రస్తుతం నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెలా తెరకెక్కిస్తున్న “ది ప్యారడైజ్” చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో “జడలు” లుక్‌లో ఆయన ఇటీవల వెలువడిన పోస్టర్లు మంచి హైప్ క్రియేట్ చేశాయి. ప్రమోషనల్ మెటీరియల్‌తో పాటు, మార్చి 2026లో రాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇక మరోవైపు, దర్శకుడు శేఖర్ కమ్ముల నానిని దృష్టిలో పెట్టుకొని ఓ కొత్త కథ రాస్తున్నారు. తాజాగా ధనుష్ హీరోగా రూపొందించిన “కుబేరా” విడుదల తర్వాత, కమ్ముల నానిని కలసి వెంటనే కలిసి పనిచేయాలని ఇద్దరూ ఓకే చెప్పుకున్నారు.

ఇంకా నటీనటుల ఎంపికపై స్పష్టత రాకపోయినా, కమ్ముల తన ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవిని తీసుకునే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆమెతో ఆయన చేసిన “ఫిదా”, “లవ్ స్టోరీ” చిత్రాలు గుర్తుండిపోయే హిట్‌లు.

అలాగే, నాని – సాయి పల్లవి కాంబినేషన్‌ “ఎంసీఏ”, “శ్యామ్ సింగరాయ్” లాంటి విజయాలను అందించిన నేపథ్యంలో, ఈ హిట్ జంట మళ్లీ స్క్రీన్‌పై కనిపించబోతుందా అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

, ,
You may also like
Latest Posts from