

సినిమాల్లో హింస పెరుగుతున్న తీరు భయపెడుతోంది. ఒకప్పుడు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొంత వరకు యాక్షన్ చూపించేవారు. ఇప్పుడు మాత్రం రక్తపాతం, నరికే దృశ్యాలు, క్రూరమైన హత్యలు… వీటిని కొత్త గిమ్మిక్‌లా మార్చేస్తున్నారు. కానీ ఆడియన్స్ నిజంగా ఇలాంటి హింసను ఎంజాయ్ చేస్తున్నారా? లేకపోతే విసిగిపోతున్నారా? ఇదే ఇప్పుడు బిగ్ డిబేట్.

ఈ వారం రిలీజ్ కాబోతున్న టైగర్ ష్రాఫ్ ‘బాఘీ 4’ ఈ వాదనకు కొత్త ఉదాహరణ. శాండల్‌వుడ్ డైరెక్టర్ హర్ష తెరకెక్కించిన ఈ సినిమా, టీజర్‌తోనే “ఇంకో స్థాయిలో హింస రాబోతుంది” అని క్లారిటీ ఇచ్చేసింది. ట్రైలర్‌లో మరింత బ్లడీ విజువల్స్‌తో ప్రేక్షకులకి మిక్స్‌డ్ ఫీలింగ్ వచ్చింది.
ఇప్పటికే ఈ విజువల్స్ కు సెన్సార్ బోర్డు షాక్ అయ్యింది.
- శవపేటిక మీద హీరో నిలబడే సీన్
- తెగిన చేయితో సిగరెట్ వెలిగించుకోవడం
- పాక్షిక నగ్న దృశ్యం
- అమ్మాయిని అసభ్యంగా తాకే షాట్
- కత్తులతో రౌడీలను 11 సెకండ్ల పాటు అమానుషంగా నరికేసే సన్నివేశం
ఇలాంటి మొత్తం 23 సీన్స్‌పై కట్స్ వేసి, ఆడియోలో కూడా డజన్ల కొద్దీ మ్యూట్స్ సూచించింది. చివరికి సినిమా 6 నిమిషాల 37 సెకన్లు కత్తిరించుకుని సర్టిఫికెట్ తెచ్చుకుంది.
హర్ష స్టైల్ ఎప్పుడూ క్రూరహింసకే సింబల్. ఆయన గత చిత్రం ‘మార్కోని’ లో ఇదే ట్రెండ్ కనిపించింది. మలయాళంలో ఆ హింస హిట్ అయ్యింది కానీ, హిందీ, తెలుగు ఆడియన్స్ తిరస్కరించారు. అయినా ఇప్పుడు అదే పద్ధతిని టైగర్ ష్రాఫ్‌తో పదింతలు పెంచినట్టుంది.
ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బలవంతంగా రక్తపాతం నింపడం, సెన్సార్ అడ్డుకుంటే కత్తిరించుకుని రిలీజ్ చేయడం… ఈ ఫార్ములా రాను రాను మామూలైపోతున్నట్టుంది.