
తేజ సజ్జ హీరోగా, రితికా నాయక్ హీరోయిన్గా నటించిన సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “మిరాయ్” సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లు రాబడుతూ, తేజా సజ్జ కెరీర్లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రతంలో “వైబ్ ఉంది” పాట… రిలీజ్ కి ముందే సోషల్ మీడియా లో సునామీ క్రియేట్ చేసింది. యూట్యూబ్, రీల్స్, టిక్‌టాక్ – ఎక్కడ చూసినా అదే వైబ్! కానీ సినిమా థియేటర్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ మిస్ అవ్వడంతో ఫ్యాన్స్ కి మాసివ్ డిసప్పాయింట్మెంట్.
“హిట్ పాటే లేకుండా మిరాయి ఎలా ఫుల్ ఫీలవుతాం?” అని ఆడియన్స్ నుండి కమెంట్స్ వరదలా వచ్చాయి.
ఇప్పుడు మాత్రం మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ అద్భుతం!
తేజా సజ్జా – కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన మిరాయి బాక్సాఫీస్ దగ్గరే కాకుండా పాన్-ఇండియా లెవెల్ లో సెన్సేషన్ అవుతుంది. ఇప్పటికే ₹120+ కోట్లు వసూలు చేసిన ఈ బ్లాక్‌బస్టర్, దసరా హాలీడే సీజన్ కి రెడీ అవుతుండగా, ఫ్యాన్స్ డిమాండ్ పై “వైబ్ ఉంది” సాంగ్ ని థియేటర్స్ లోకి యాడ్ చేశారు!
ఇక ఈ ఎడిషన్ తో మిరాయి రన్ కి మరింత బూస్ట్ రావడం ఖాయం. ఈ పాట థియేటర్లలో ప్రదర్శించబోతున్నట్టు తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ఇంతకాలంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్సయ్యాం.. ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో చూసేస్తాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.కానీ ఛాలెంజ్ కూడా పెద్దదే – ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ OG దగ్గరలోనే ఉంది.
మరి “వైబ్ ఉంది” పవర్ తో మిరాయి, OG తుఫాన్ ని ఎదుర్కొని, బాక్సాఫీస్ లో తన సత్తా చూపుతుందా?
