దసరా సీజన్‌ అంటే పండుగే కాదు, టాలీవుడ్‌లో కొత్త సినిమాల రిలీజ్ లు, ప్రారంభాల పండుగ కూడా. ఈ ఏడాది దసరా మరింత ప్రత్యేకం కానుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు లాంచ్ అవ్వబోతున్నాయి. వివరాల్లోకి వెళితే…

మెగాస్టార్ చిరంజీవి – బాబీ సినిమా

‘వాల్తేర్ వీరయ్య’తో సూపర్ హిట్ అందించిన కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా దసరా సందర్భంగా లాంచ్ అవుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అక్టోబర్ 2న ఘనంగా లాంచ్ చేసి, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పూర్తి అయిన తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.

నేచురల్ స్టార్ నాని – సుజీత్ కాంబో

‘ఓజీ’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని ఓ మాస్ యాక్షన్ సినిమాతో రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమం దసరా రోజే జరుగనుంది. షూట్ మాత్రం వచ్చే ఏడాది మొదలు కానుంది.

విజయ్ దేవరకొండ – రవి కిరణ్ కోలా సినిమా

‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి దిల్ రాజు బ్యానర్‌లో ఎంటర్ అవుతున్నారు. ఈసారి డైరెక్టర్ రవి కిరణ్ కోలాతో కలిసి. భారీ స్థాయిలో దసరా రోజునే లాంచ్ చేసి, ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం క్రియేట్ చేయనున్నారు.

ఇవే కాదు, ఈ దసరా సీజన్‌కి మరెన్నో సినిమాలు లాంచ్ అయ్యే లైన్లో ఉన్నాయి.

, , , , , ,
You may also like
Latest Posts from