సినిమా వార్తలు

బాహుబలి రీ–రిలీజ్ కాదు.. బాక్సాఫీస్ పునర్జన్మ!

రాజమౌళి సృష్టించిన చరిత్ర… మళ్లీ థియేటర్లను తలకిందులు చేస్తోంది! ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’—ఎప్పుడో ఇండస్ట్రీని మార్చిన ఇవి, ఇప్పుడు ఒకే సూపర్ ఎడిషన్‌గా విడుదలై… బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపబోతున్నాయి.

“రీ–రిలీజ్‌కు థియేటర్లకు రావటం తగ్గిపోయింది” అన్న వాళ్లందరికీ… బాహుబలి: ది ఎపిక్ సూటిగా చెప్పిన సమాధానం ..“ఇక్కడ రాజమౌళి కట్టిన రాజ్యం… రూల్స్‌ నీకు పని చేయవు.”

₹10 కోట్ల అడ్వాన్స్ సేల్! రీ–రిలీజ్ రికార్డులు చెరిగిపోయాయి!

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, రిలీజ్‌కు ముందే ₹10 కోట్లు దాటి నేరుగా గాలి చీల్చేసింది. రీ–రిలీజ్ హిస్టరీలో… ఇంత అడ్వాన్స్, ఇంత హైప్? సూట్‌గా అన్‌ప్రెసిడెంటెడ్!

USA ప్రీమియర్లు ధమాకా అక్కడే షోలు మొదలై, ఎక్కడ చూసినా ఒక్క మాట — MUST WATCH AGAIN!

3 గంటలు 45 నిమిషాల రన్‌టైమ్? సందేహించిన వాళ్లే ఇప్పుడు షాకులో!

“రెండు సినిమాలు కలిపి ఒకేసారి ఎవరు చూస్తారు?” అన్నవారిని… థియేటర్లలోని రెస్పాన్స్ ఒక్కసారిగా నిశ్శబ్దం చేయబోతోంది. స్క్రీన్స్‌లో రాజమౌళి విజన్ మొదలైన క్షణం నుంచి— సమయం, లాజిక్, డౌట్స్ అన్నీ ఆఫే! ప్రేక్షకులు ఒక్క కంఠంతో “ఇది మళ్లీ చూడాల్సిందే… ఇది సినిమా కాదు, అనుభవం!”

US రివ్యూస్ — అదుర్స్

అడ్వాన్స్ రిజర్వేషన్స్ — బ్లాస్ట్ లెవెల్

బెంచ్‌మార్క్: డే–1 రీ–రిలీజ్ రికార్డ్స్ క్లీన్స్వీప్

ఈ రాత్రి నుంచి ఇండియా ప్రీమియర్లు… రేపటిదాకా? బాక్సాఫీస్ కొత్త రికార్డ్ లు రెడీ!

Similar Posts