సినిమా వార్తలు

ఎక్కడ చూసినా కలెక్షన్ల దుమ్మే… కానీ ఈ దేశాల్లో ధురంధర్ బ్యాన్? షాకింగ్ రీజన్!

థియేటర్లలో రాంపేజ్ చేస్తోంది. ఇండియా – ఓవర్సీస్ ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ హంగామా. కానీ ఇదే సమయంలో ఒక ఆశ్చర్యం… ధురంధర్ కొన్ని దేశాల్లో పూర్తిగా బ్యాన్ అయ్యింది! సినిమా హైప్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రశ్న మాత్రమే వైరల్ అవుతోంది:

“అంత పెద్ద హిట్ అవుతున్న సినిమా… అక్కడ ఎందుకు రిలీజ్ కాలేదు?”

హైప్ లేకుండా ప్రారంభమైన ఈ స్పై యాక్షన్ డ్రామా, మొదటి షో నుంచి ఓపెనింగ్స్, టాక్, కలెక్షన్స్—all in one గా దుమ్ము రేపింది. పాకిస్తాన్ అండర్‌వల్డ్, టెరర్ ఆపరేషన్స్‌, ఇంటెలిజెన్స్ వార్‌—ఈ మూడు లేయర్లను డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎంత షార్ప్‌గా కలిపాడో చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. రణవీర్ సింగ్ ఇంత ఇంటెన్స్ పాత్రలో కనిపించడం అరుదు; కానీ అసలు సర్ప్రైజ్ మాత్రం సపోర్టింగ్ కాస్ట్‌ దగ్గరే ఉంది.

ఇండియా, ఓవర్సీస్ ఎక్కడ చూసినా కలెక్షన్ రికార్డులు క్రియేట్ చేస్తున్నా… కొన్ని దేశాల్లో మాత్రం సినిమాను విడుదలే చేయనివ్వలేదు. ఇదే ధురంధర్‌ను ఇప్పుడు హిట్ సినిమా నుంచి నేషనల్ టాపిక్‌గా తీసుకువచ్చిన కీలక కారణం.

ముస్లిం నెగటివ్ పోర్ట్రేయల్? – గల్ఫ్ కంట్రీస్ వెంటనే స్టాప్!

ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద అగ్ని రాజ్యం చేస్తున్నా, గల్ఫ్ రీజియన్ మాత్రం గేట్లు మూసేసింది. హిందీ సినిమా ఫాలో అవుతున్న వాళ్లందరికీ తెలిసిందే — ముస్లింలను నెగటివ్‌గా చూపించే కథలు వస్తే గల్ఫ్ దేశాలు రిలీజ్‌కు అనుమతి ఇవ్వవు.

‘ఫైటర్’, ‘టైగర్ 3’ లకు ఎదురైన సమస్యే ఇప్పుడు ధురంధర్‌ని కూడా తాకింది.

బ్యాన్ చేసిన దేశాలు:
బహ్రెయిన్
కువైట్
ఒమాన్
ఖతార్
సౌదీ అరేబియా
యుఎఈ

అంటే, బాలీవుడ్‌కు పెద్ద మార్కెట్ అయిన మొత్తం గల్ఫ్ రీజియన్ ఈ సినిమాను అడ్డుకుంది.

బాక్సాఫీస్ సునామీ: గల్ఫ్ లాస్ ఉన్నా… 1 వారం లో 300 కోట్లు దాటిన ధురంధర్!

మేకర్స్ చెప్పిన ప్రకారం, సినిమా మొదటి వారంలోనే 300 కోట్ల గ్రాస్ దాటేసింది. గల్ఫ్ మార్కెట్ లేకపోవడం బాక్సాఫీస్‌కి భారీ లోటే. కానీ ఆ లోటు కూడా సినిమా గ్రోత్‌ను ఆపలేకపోయింది. ప్రేక్షకుల నుండి వచ్చిన యూనానిమస్ పాజిటివ్ టాక్ వల్ల, థియేటర్లలో లాంగ్ రన్ ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బ్యాన్ అయినా… బ్లాక్‌బస్టర్ రన్ ఆపలేకపోయింది!

గల్ఫ్ మార్కెట్ లేకపోవడం బాలీవుడ్ సినిమాలకు సాధారణంగా పెద్ద దెబ్బ. కానీ ధురంధర్ మాత్రం ఆ అడ్డంకిని సరిగ్గా దాటేసింది. కలెక్షన్లు గట్టిగా, టాక్ పాజిటివ్‌గా, స్క్రీన్స్ పెరుగుతున్నాయి.

ఒక వైపు బ్యాన్… మరో వైపు బ్లాక్‌బస్టర్ — ఈ రెండు కలిసి ధురంధర్‌ను ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ చేసిేశాయి!

Similar Posts