యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ అనే హిందీ మూవీలో నటిస్తున్నారు . యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. ఇద్దరూ బిగ్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భారీ మల్టీస్టారర్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బయిటకు వచ్చింది.
బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ఈ సినిమాలో ఓ డాన్స్ సీక్వెన్స్ లో అదరకొట్టబోతున్నారు. ఇద్దరు పోటాపోటిపడి మరి డాన్స్ చేయబోతున్నారు.
ఈ నెలాఖరుకు కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ ఈ సాంగ్ షూట్ చేస్తారు. సినిమా స్పెషల్ ఎట్రాక్షన్ లో ఈ సాంగ్ సీక్వెన్స్ ఒకటిగా నిలబోతోంది. ఈ పాటను బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ వైభవ్ మర్చంచ్ డిజైన్ చేయబోతున్నారు. ఇప్పటికి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ల షూట్ పూర్తైంది.\
మరో ప్రక్క వార్ 2 లో ఎన్టీఆర్ ఏ రోల్ చేస్తున్నాడోననే ఆసక్తి సినీ ప్రేమికుల్లో ఎక్కువైంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ పాత్రలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉండనుందట.
వార్ 2లో ఎన్టీఆర్ ఓ భారతీయ రా (RAW) ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై ఓక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్, యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోంది.
అయితే ఇది సాధారణ పాత్ర కాదు, విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌గా ఆయన కనిపించనున్నట్లు ముందుగానే ఒక క్లారిటీ వచ్చింది.