హీరో శ్రీకాంత్ (Actor Srikanth)కుమారుడు రోషన్(Roshan Meka)హీరోగా తొలి సినిమా చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. నిర్మాత కాన్వెంట్, పెళ్లిసందD లాంటి సినిమాలతో అలరించిన రోషన్ ఆ తర్వాత కొత్త సినిమాలు ఏమీ చేయలేదు. పెద్ద బ్యానర్, బ్లాక్ బస్టర్ కంటెంట్ తో రావాలని ప్లాన్ చేసారు. అందుకు ఇప్పుడు రెడీ అయ్యింది రంగం. ఈక్రమంలో రోషన్ కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ రోజు రోషన్ బర్త్‌డే కానుకగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర టీమ్.
ఈ వీడియో చూస్తుంటే.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఫుట్‌బాల్(soccer) ఆట నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రోషన్ రెండు కొత్త లుక్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.