బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా. గతంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగడంతో, రామ్ చరణ్ ఇప్పుడు ఖచ్చితమైన టైమ్‌లైన్‌తో పని చేస్తున్నారు.
ఈసారి ఏదైనా తప్పకుండగా సినిమా 2025 చివర్లోనే కంప్లీట్ చేయాలని రామ్ చరణ్ స్పష్టంగా చెప్పారట. రిలీజ్ అయితే 2026 మార్చిలో అయినా, పనుల్లో ఆలస్యం అస్సలు ఉపేక్షించబోమని హెచ్చరించారట. దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ముందుగానే ఈ విషయాన్ని చెప్పి, షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేయాలని క్లియర్‌గా ఆదేశించారట.
ఇకపై రామ్ చరణ్ ఒక్కో సినిమాకు గరిష్ఠంగా ఒకే ఒక్క సంవత్సరం మాత్రమే కేటాయించాలనే డెసిషన్ తీసుకున్నారట. 2026 నుంచి ఆయన చేస్తే సుకుమార్ దర్శకత్వంలో లేదా మరొక పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్టు సమాచారం.
పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
మొత్తంగా చూస్తే… ఈసారి రామ్ చరణ్ గేమ్ ప్లాన్ ఎంత స్పష్టంగా ఉందంటే, ఆలస్యం అనే పదానికి ఛాన్స్ లేదు!