2020లో వచ్చిన భీష్మ త‌ర్వాత నితిన్‌కి పెద్ద విజయం ద‌క్కలేదు. కానీ త‌మ్ముడు రూపంలో వ‌చ్చిన ఫెయిల్యూర్ మాత్రం అతని కెరీర్‌లోనే ఒక వార్నింగ్ బెల్ మోగించినంత కీలకమైన దెబ్బ. కాస్త హోప్‌తో చేసిన సినిమా కావడం, త‌న పారితోషికం తీసుకోకుండా “ప్రాఫిట్ షేరింగ్ మోడల్”పై ముందుకెళ్లడం… ఇవన్నీ త‌మ్ముడు సినిమాపై నితిన్ పెట్టిన నమ్మకాన్ని చూపించాయి. కానీ ఫలితం మాత్రం…డిజాస్టర్.

ఇక ఈ డిజాస్టర్ ఇంపాక్ట్ ఏంటంటే — అదే నిర్మాణ సంస్థ, అదే హీరో కాంబినేషన్‌లో ఉన్న ‘ఎల్ల‌మ్మ’ అనే సినిమా కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయిందని సమాచారం. ‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా మొదట నానితో ప్లాన్ చేసారు. తర్వాత నితిన్ కు స్క్రిప్ట్ ట్రాన్స్‌ఫర్ అయింది. కానీ ఇది బలగం లా తక్కువ బడ్జెట్ సినిమా కాదు. ఈ కథకు గట్టిగా ఖర్చు పెట్టాల్సిందే. ఇప్పుడు ఇదే దిల్ రాజుకు తల పట్టుకునే ప్రశ్నగా మారింది.

నితిన్‌తో త‌మ్ముడు వంటి పెద్ద ఫ్లాప్‌ త‌ర్వాత మ‌ళ్లీ అదే హీరోతో ఇంకొక సినిమా చేస్తారా? అన్న అనుమానాలు నిర్మాత వ‌ద్దే కాదు… ఇండస్ట్రీలోనూ వినిపిస్తున్నాయి.

ఇంతకాలం దిల్ రాజు ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌ను తమ్ముడు ఫలితంపై ఆధారపడి వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు తమ్ముడు బాక్సాఫీస్‌లో పూర్తిగా బోల్తా కొట్టిన తర్వాత, దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న.

ఈ స్టేజ్‌లో దిల్ రాజు వేసే అడుగు, నితిన్ కెరీర్‌పై ప్రభావం చూపడమే కాదు… వేణు వంటి కొత్త దర్శకుడి మీద కూడా ఒత్తిడిని తీసుకొస్తుంది.

, , , ,
You may also like
Latest Posts from