సినిమా వార్తలు

‘అఖండ 2’ ఆట ముగిసినట్లేనా? OTT లో ఎప్పుడు?

అఖండ 2 రిలీజ్‌కు ముందు ఏర్పడిన హడావుడి ఇప్పుడు నెమ్మదిగా మాయమవుతోంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్‌లో ఉండే అంచనాలు వేరు. సీక్వెల్ అన్న కారణంతో థియేటర్ల దగ్గర మొదట్లో మంచి ఓపెనింగ్స్ కనిపించాయి. కానీ ఆ ఉత్సాహం ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. ఫస్ట్ వీకెండ్ తర్వాత నుంచే కలెక్షన్స్ ఒక్కోరోజు తగ్గుతూ రావడం ట్రేడ్‌కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

వీక్‌డేస్‌లో మొదలైన డ్రాప్, వీకెండ్స్‌లో కూడా కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోవడంతో, సినిమా థియేటర్ రన్ చివరి దశకు చేరిందన్న అభిప్రాయం బలపడుతోంది. సింగిల్ స్క్రీన్‌లలో మాత్రం ఇంకా కొంత ఫుట్‌ఫాల్స్ కనిపిస్తున్నాయి. కానీ అది కూడా మొత్తం రన్‌ను నిలబెట్టే స్థాయిలో లేదన్నది ట్రేడ్ అంచనా.

ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా రిపీట్ ఆడియన్స్ లేకపోవడం, బలమైన బజ్ క్రియేట్ కాకపోవడాన్ని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్‌కు ముందు ఉన్న హైప్, తెరపైకి వచ్చాక అదే స్థాయిలో కన్వర్ట్ కాలేదు. దాంతో అఖండ 2 బిగ్ స్క్రీన్ జర్నీ దాదాపు ముగింపు దశకు చేరిందన్న భావన నెలకొంది.

ఇప్పుడీ దశలో అందరి చూపు ఒక్కటే… OTT. థియేటర్లలో తగ్గిన ఆసక్తి, డిజిటల్‌లో పెరిగే అవకాశముందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇప్పటికే Netflix ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోవడంతో, అఖండ 2 OTT రిలీజ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. థియేటర్‌కు వెళ్లని ప్రేక్షకులు, మళ్లీ చూడాలనుకునే అభిమానులు… అందరూ ఇప్పుడు ఆన్‌లైన్ ప్రీమియర్ కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఉండవచ్చు అనే విషయం వినపడుతోంది. ఇప్పుడు మాత్రం అఖండ 2 భవితవ్యాన్ని నిర్ణయించేది… Netflix స్క్రీన్ మాత్రమే .

Similar Posts