బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన నోట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. కారణం – ముంబై బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ఆమె కొత్త ఇల్లు. ఈ బంగ్లా ఇంకా పూర్తికాకముందే, ఎవరో లోపలికి వెళ్లి వీడియో తీశారు. ఆ వీడియోను అనేక పబ్లికేషన్స్, సోషల్ మీడియా పేజీలు “ఎక్స్‌క్లూజివ్ కంటెంట్” అన్నట్లుగా షేర్ చేసాయి. దీనిపై ఆలియా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, “ఇది ప్రైవసీకి విరుద్ధం మాత్రమే కాకుండా భద్రతపరమైన సమస్య” అని స్పష్టంగా పేర్కొంది.

ముంబైలాంటి ప్రదేశాల్లో ప్రెవసీ దొరకడం కష్టమే. కానీ ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యం అనే సారాశంతో ఈ నోట్ రాసుకొచ్చింది ఆలియా. అలాగే ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీ దృష్టికి వస్తే షేర్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేసింది. అలాగే మీడియా మిత్రులు ఎవరైతే వాటిని పోస్ట్ చేశారో.. వాటిని వెంటనే డిలీట్ చేయాలి కోరింది.

ప్రైవసీ – సెలెబ్రిటీ అయినా, పర్శనల్ స్పేస్ అవసరం

ఆలియా కామెంట్స్ చెప్పేదేమిటంటే– సెలెబ్రిటీలు ఎప్పుడూ పబ్లిక్ కళ్లలో ఉన్నా, వారి పర్శనల్ ప్రైవసీను కాపాడుకోవాల్సిన హక్కు ఉంది. ఇంటి లోపలికి వెళ్లి వీడియో తీయడం అనేది కేవలం ఓవర్ ఎక్సైట్మెంట్ కాదు, అది ఒకరిని వారి “సేఫ్ స్పేస్” నుంచి లాగేయడమే. మనం చాలాసార్లు “వాళ్లు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి సహించాలి” అని అనుకుంటాం. కానీ, ఒకరి ఇంటి తలుపు దాటి కెమెరా పెట్టడం మాత్రం అసలు సరైనది కాదు.


మీడియా లిమిట్స్ – న్యూస్ & ఇన్వేజన్ మధ్య సరిహద్దు

ఇలాంటి సంఘటనలు మరోసారి మీడియా నైతికతను ప్రశ్నార్థకంగా నిలబెడుతున్నాయి. ఒక కొత్త ఇల్లు ఎలా ఉందో, ఎంత విలాసవంతమో తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకులకు ఉండొచ్చు. కానీ ఆ కుతూహలం తీర్చే ప్రయత్నంలో మీడియా ప్రైవసీ బార్డర్స్ దాటకూడదు. న్యూస్ రిపోర్టింగ్ & ప్రైవేట్ లైఫ్ మధ్య ఒక గీత ఉండాలి. దాన్ని దాటితే, అది జర్నలిజం కాదు, కేవలం “సెన్సేషన్” కోసం చేసిన పని అవుతుంది.


భద్రతా సమస్యలు – స్టార్‌లకే కాదు, సమాజానికీ ప్రమాదం

ఆలియా స్పష్టంగా చెప్పినట్టు, ఈ విషయం కేవలం ప్రైవసీ ఉల్లంఘన మాత్రమే కాదు, భద్రతా కోణంలో కూడా ప్రమాదకరం. ఒక ఇంటి ప్లాన్, లోపలి నిర్మాణం, ఎంట్రీ పాయింట్స్ అన్నీ పబ్లిక్‌లోకి వస్తే, అది భవిష్యత్తులో సెక్యూరిటీ రిస్క్ అవుతుంది. సెలెబ్రిటీలకే కాదు, సాధారణ ప్రజలకీ ఇలాంటి దృశ్యాలు షేర్ చేయడం హానికరం కావచ్చు.


చివరి మాట

ఆలియా భట్ ఉదంతం మరోసారి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తింది – సెలెబ్రిటీ ప్రైవసీ ఎక్కడ మొదలై, మీడియా స్వేచ్ఛ ఎక్కడ ముగియాలి?
ఒక సమతుల్యం ఉండాలి. పబ్లిక్ ఆసక్తి & వ్యక్తిగత హక్కులు రెండూ సజావుగా నడిచేలా సమాజం, మీడియా, అభిమానులు కలసి ఆ గీతను గౌరవించాలి.

, ,
You may also like
Latest Posts from