పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒక వైపు అతని స్టైల్, మరోవైపు మాస్-సెంటిమెంట్ మిక్స్ చేసిన స్క్రీన్ ప్రెజెన్స్… ఇప్పుడు ఆ పేరు ఒక్కటే ఇండియా అంతటా హైప్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు అట్లీ… “థేరి” నుండి “జవాన్” వరకు అన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్సే. సౌత్ మాస్ కమర్షియల్ టెంప్లేట్ ని బాలీవుడ్ స్థాయిలోకి తీసుకెళ్లిన డైరెక్టర్ అట్లీ.

ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా “AA22 x A6”… ఇది ఓ మామూలు సినిమా కాదు. పాన్ ఇండియా స్థాయిలో, రికార్డు బ్రేకింగ్ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్… ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం హైద‌రాబాద్‌లో జోరుగా జరుగుతున్నాయి. దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ తో కలసి కీలక అంశాలపై చర్చలు ముగించారు. జూన్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా ఒక “భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్”గా రూపొందుతుంది. భారతీయ విలువలు గల కథ, గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే నేరేషన్ — అంటే అట్లీ మార్క్ తో పాటు, బన్నీ స్టైల్ మ్యాజిక్ మిక్స్ అవుతుంది.

ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అధినేత కలానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కూడా హాలీవుడ్ కంపెనీలు భాగస్వామ్యం అవుతుండడం… ఈ సినిమా స్థాయిని చెప్పకనే చెబుతోంది.

అల్లు అర్జున్ ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కు శ్రీకారం చుట్టారు. కొత్త లుక్ కోసం ప్రైవేట్ ట్రైనర్ ను హైర‍్ చేశారు. అలాగే, హెయిర్ స్టైల్ కూడా మార్చారు. హీరోయిన్ పేర్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో భాగం కానున్నారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి మాస్, క్లాస్, ఎమోషన్ మిక్స్ ఉన్న సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ ఎక్కే మరో పెద్ద మెట్టు ఇదే అవుతుందా?

,
You may also like
Latest Posts from