హిట్ సినిమాకు సీక్వెల్స్ రెడీ అవ్వటం కామన్. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతికి సూపర్ హిట్టైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సీక్వెల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సీక్వెల్ సినిమాకు టైటిల్ కూడా చెప్పేసారు. అలాగే మళ్లీ వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని థియేటర్ లో దించేస్తామని చెప్పారు. ఇంతకీ సీక్వెల్ టైటిల్ ఏంటి.

విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

కేవలం ఐదు రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమైంది. ఇంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ ను తీయడానికి మూవీ టీం సిద్ధమవుతోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి సీక్వెల్ ను కన్ఫర్మ్ చేశాడు. (Sankranthiki Vasthunam Sequel)

‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ కోసం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని క్యారెక్టర్స్ ని తీసుకొని, డిఫరెంట్ స్టోరీతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సీక్వెల్ కి ‘మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని, వచ్చే సంక్రాంతికి ఇది విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ… ఈ సినిమాకి సీక్వెల్ చేయొచ్చు.. ఆ స్పేస్ ఉంది.. అంటే ఈ టెంప్లెట్ చాలా బాగా వర్కవుట్ అయింది.. దీన్నే డిఫరెంట్ సిట్యూవేషన్స్‌కి డీల్ చేయొచ్చు.. అలానే రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ కావొచ్చు.. ఏమో మరో అద్భుతం చేస్తామేమో.. అంటూ అనిల్ రావిపూడి చెప్పారు.

, , ,
You may also like
Latest Posts from