అనుష్క శెట్టి అంటేనే ఓ ప్రత్యేక క్రేజ్. ‘బాహుబలి’, ‘అరుంధతి’, ‘భాగమతి’ లాంటి చిత్రాల్లో ఆమె చూపిన ప్రతిభకు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఇప్పటికీ విడిచి పెట్టలేని ఫాలోయింగ్ ఉంది. చాలా సెలెక్టివ్‌గా, సంవత్సరంకి ఒక్కో సినిమా మాత్రమే చేసేందుకు ఆసక్తి చూపుతున్న అనుష్క… ఇప్పుడు “ఘాటి” అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ, ఈ సినిమా రిలీజ్ చివరి నిమిషంలో డిలే కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వాస్తవానికి జూలై 11న “ఘాటి” రిలీజ్ కావాల్సి ఉండగా… అనూహ్యంగా పోస్ట్‌పోన్ అయింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం… ఈ నిర్ణయం స్వయంగా అనుష్క తీసుకున్నదట! కారణం? సినిమాలో ఆమె బాడీకి సంబంధించిన కొన్ని సీన్స్‌లో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆమెకు ఇబ్బందిగా అనిపించాయట.

అనుష్క ఆమె కెరీర్‌లో ఎప్పుడూ బోల్డ్ & బ్యూటిఫుల్ ఇమేజ్‌ని కాపాడుకున్న నటి. స్క్రీన్ మీద ఆమె ఎలా కనిపిస్తుందన్న విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. ముఖ్యంగా “బాహుబలి” తర్వాత ఆమెపై ఉన్న అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. శారీరకంగా కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురైనప్పటికీ, ఆమె ఆత్మవిశ్వాసాన్ని వదలలేదు. అప్పటి నుంచే స్క్రీన్ మీద ఫిట్‌గా, గ్రేస్‌ఫుల్గా కనిపించేందుకు ఆమె ప్రత్యేకంగా డిజిటల్ టచ్‌అప్స్‌ పై దృష్టి పెట్టింది. ముఖం మాత్రమే కాదు… ఆమె మొత్తం బాడీ ఫ్రేమ్‌ను కూడా ఫైన్‌ట్యూన్ చేసేలా విజువల్ ఎఫెక్ట్స్ వాడుతోంది.

“ఘాటి” కూడా అలాగే నిర్మాణంలో అధిక కాలం తీసుకున్న ప్రాజెక్ట్. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు క్రిష్, నిర్మాతలు UV క్రియేషన్స్ & ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్. UV క్రియేషన్స్ అన్నీ అనుష్కకు దగ్గరగా ఉండే బ్యానర్‌… ఆమె చెప్పే ఒక్క డిమాండ్‌ను కూడా లైట్ తీసుకోదు.

ఇప్పుడు తుది కట్ చూసిన అనుష్క… కొన్ని విజువల్ డీటెయిల్స్ తక్కువ స్టాండర్డ్‌లో ఉన్నాయని అభిప్రాయపడింది. దాంతో, ఆమె క్లియర్‌గా చెప్పిందిట – “ఇవన్నీ కరెక్ట్ చేసిన తర్వాతే రిలీజ్ డేట్ ఫిక్స్ చేయండి.”

ఇంతవరకూ హీరోల విషయంలో మాత్రమే వాడిన డిజిటల్ రిఫైన్మెంట్ టెక్నిక్‌ను… ఈ లెవెల్లో తన కోసం అందిపుచ్చుకుంటున్న నటీమణి అంటే… అది అనుష్క శెట్టియే కావాలి!

ఘాటి ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అన్నది తేలాలంటే… ముందు అనుష్క డిజిటల్ టచ్చింగ్స్ పూర్తి కావాలి!

, , , ,
You may also like
Latest Posts from