తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరిగా పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకం. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిపోయినా ఆయనపై ఉన్న అభిమానం, క్రేజ్ , మోజు ఏమాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఆయన పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన తర్వాత అభిమానుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పాలి. పవన్ అభిమానులు ఆయనను కేవలం సినీ హీరోగానే కాదు, ఒక ప్రేరణ , ఆరాధ్యుడు గా చూసుకుంటారు.

ఇదే విషయాన్ని తాజాగా మళ్లీ ఒకసారి చాటిచెప్పింది నటి ఆషు రెడ్డి . తన బోల్డ్ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అయ్యే ఆషు, ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచే స్టెప్ వేసింది.

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె తన శరీరంపై వేసుకున్న టాటూ ని బయటపెట్టింది. తన రైట్ ఛెస్ట్ సైడ్‌లో ‘Pawan Kalyan’ అని శాశ్వతంగా చెక్కించుకుని ఆ ఫోటోని షేర్ చేసింది. సాధారణంగా అమ్మాయిలు తమ లవర్స్ లేదా జీవిత భాగస్వాముల పేర్లు టాటూ చేయించుకుంటారు. కానీ ఆషు మాత్రం తన ఆరాధ్య హీరో – జనసేనాని పవన్ కల్యాణ్ పేరు టాటూ చేయించుకుని తన అభిమానాన్ని కొత్త రీతిలో వ్యక్తం చేసింది.

అదే ఫోటోకు ఆమె ఇలా క్యాప్షన్ కూడా పెట్టింది:

“Proud to be born on the same land as you are!! Happy birthday to the GOD of people.”

సెప్టెంబర్ 15న తన బర్త్‌డే జరుపుకోబోతున్న ఆషు రెడ్డి కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్లకు పైగా ఫాలోయింగ్ ఉంది. ఆమె ‘చల్ మోహన్ రంగ’, ‘ఏవం’ వంటి సినిమాల్లో నటించినా, బిగ్ బాస్ షోతో, అలాగే రామ్ గోపాల్ వర్మతో చేసిన సెన్సేషనల్ ఇంటర్వ్యూతోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఆ ఇంటర్వ్యూలో వర్మ ఆమె తొడలను పొగిడిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.

, , , ,
You may also like
Latest Posts from