సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ‘అతడు’ 4K రీ-రిలీజ్‌ ఎట్టకేలకు ఆగస్టు 9న థియేటర్లకు రానుంది. అభిమానులకే కాదు, సాదా ప్రేక్షకుడికీ ఈ క్లాసిక్ సినిమా మళ్లీ స్క్రీన్ పై చూడడం ఒక స్పెషల్ ఫీలింగ్. అయితే, అంచనాల్ని తలకిందలు చేస్తూ, ఈసారి ‘అతడు’కి ఓపెనింగ్ రేంజ్ మాత్రం ఆశించినంత రికార్డుగా ఉండబోవట్లేదు.

రీఫ్రెష్ చేస్తే… మహేష్ బాబు రీ-రిలీజ్‌లలో కింగ్ అని చెప్పొచ్చు. ‘మురారి’, ‘ఖలేజా’ లాంటి సినిమాలు తిరిగి విడుదలై మంచి కలెక్షన్లు సాధించాయి. అటువంటి ఫామ్‌లో ‘అతడు’ కూడా బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తుందని అందరూ భావించారు. మహేష్ బాబు 50వ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా రీ-రిలీజ్ కావడం విశేషమే కానీ… బాక్సాఫీస్ వద్ద పరిస్థితి మాత్రం సహకరించట్లేదు.

భారీ రిలీజ్‌ల మధ్య అడ్డంగా అట్టడుగున ‘అతడు’?

గత రెండు వారాలుగా ‘కింగ్‌డమ్’, ‘హరిహర వీరమల్లూ’, ‘మహావతార్ నరసింహ’ వంటి బడా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ఇకపై ఆగస్టు 14న ‘కూలీ’, ‘వార్ 2’ వంటి భారీ చిత్రాలు రావాల్సి ఉంది. అంటే మధ్యలో వస్తున్న ‘అతడు’కి థియేటర్లు, షోలు దొరకడమే కష్టంగా మారింది.

సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలు పెద్ద సినిమాల మధ్య కాకుండా డెడ్ పీరియడ్‌లో రావడం వల్లే హైప్, కలెక్షన్లు వస్తాయి. కానీ ఈసారి ‘అతడు’కి ఆ లక్ కలిసిరాలేదు.

ప్రస్తుతం ‘అతడు 4K’కి 1.25 కోట్లు ప్రీ బుకింగ్స్ వచ్చాయి. ఇది ఓ రీ-రిలీజ్ సినిమాకి మంచి స్టార్ట్ అయినా, రికార్డ్ ఓపెనింగ్‌కి మాత్రం సరిపోదు. మొత్తం మీద చెప్పాలంటే, హైప్ ఉన్నా… బాక్సాఫీస్ రికార్డులు మాత్రం దాటలేనుంది ‘అతడు’.

, , , , , ,
You may also like
Latest Posts from