ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన మూవీ “బాహుబలి 1”. రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన సినిమా. ప్రభాస్ ను ఇండియన్ స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా రిలీజై పదేళ్లు అవుతున్నా నిన్న మొన్న రిలీజైనట్లుగా ఉంటుంది.

ఇప్పటికీ టీవీల్లో వస్తే టీఆర్పీలు అదిరిపోతూంటాయి. ఈ క్రమంలో ఈ చిత్రం రీరిలీజ్ కు ప్లాన్ చేసారు నిర్మాతలు. బాహుబలి సినిమా రీరిలీజ్ విషయాన్ని సోషల్ మీడియాలో పదే పదే అభిమానులు అడగ్గా.. ఎట్టకేలకు నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ఈ ఏడాది లోనే బాహుబలి-1, బాహుబలి-2ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఇప్పుడు అఫీషియల్ గా అక్టోబర్ లో బాహుబలి 1 ఉంటుందని తేల్చి చెప్పారు.

అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు ఫ్యాన్స్ కోసం సినిమాని రీ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసిన బాహుబలి సినిమాని రీ రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రీ రిలీజ్ లో ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.

బాహుబలి 1 రీ రిలీజ్ అయితే ఇప్పటి వరకు ఉన్న పాన్ ఇండియా సినిమా రికార్డులన్నీ బద్దలైపోతాయంటూ కామెంట్లు పెడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

, , , , , ,
You may also like
Latest Posts from