భారీ అంచనాల మధ్య వస్తున్న ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ వెర్షన్‌లో కేవలం ది బిగినింగ్‌, ది కన్‌క్లూజన్ సినిమాలను కలిపిన కాంబినేషన్ మాత్రమే కాదు — ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని సన్నివేశాలు కూడా ఉన్నాయని నిర్మాత శోభు యార్లగడ్డ స్వయంగా వెల్లడించమే అందుకు కారణం.

మొత్తం రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలు గా ఫిక్స్ చేశారు. ఆయన మాటల్లో — “రాజమౌళి గారు షూట్ చేసిన కొన్ని అద్భుతమైన సీన్స్ అప్పట్లో ఎడిట్ టేబుల్ మీదే ఆగిపోయాయి. ఇప్పుడు వాటిలో కొన్ని సర్‌ప్రైజ్‌లుగా ఈ వెర్షన్‌లో ఉండబోతున్నాయి” అని చెప్పారు.

ఇంతకీ ఆ అన్‌యూజ్డ్ సీన్స్ ఏవన్నా? మహేంద్ర బాహుబలి – భల్లాలదేవ మధ్య అదనపు క్లాష్ సీక్వెన్సా? లేక శివగామి ఎమోషన్ లేయరా? అన్న కుతూహలం అభిమానుల్లో తారాస్థాయికి చేరింది.

అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోన్న ఈ మేగా ఎడిషన్‌పై విదేశాల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ‘RRR’ సక్సెస్‌ తర్వాత, బాహుబలి మళ్లీ ఓ సార్వత్రిక ఫెనామెనన్ అవుతుందన్న నమ్మకంతో టీమ్ ప్రమోషన్స్‌కి పూర్వ రూపం ఇస్తోంది.

మరల థియేటర్‌లో బాహుబలి అనుభవం — కానీ ఈసారి, కొత్త చూపుతో!

, , , ,
You may also like
Latest Posts from