నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో అంటే థియేటర్ సీట్లు ఊగిపోవడం ఖాయం! ఈ పవర్ ప్యాక్ జోడీ నాలుగోసారి కలిసిన “అఖండ 2 – తాండవం” టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

“సౌండ్ కంట్రోల్లో పెట్టుకో… ఏ సౌండ్‌కి నవ్వుతానో, ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలియదు… నీ ఊహకు అందదు!” — ఈ ఒక్క డైలాగ్‌తోనే బాలయ్య మాస్ ఫ్యాన్స్ పూనకాల్లో తేలిపోతున్నారు.

57 సెకన్ల టీజర్ మొత్తం బోయపాటి మార్క్ యాక్షన్, డైలాగ్స్, బాలయ్య ఫైర్‌తో నిండిపోయింది. ఇంతకుముందు అఘోరా అవతారంలో కనిపించిన బాలయ్య, ఇప్పుడు మరో రహస్యమైన రూపంలో — మురళీకృష్ణ గా దర్శనమిచ్చారు. ఈ లుక్ కూడా మాస్ ఫ్యాన్స్‌కి కొత్త ఎనర్జీ ఇచ్చింది.

ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇక ఫిమేల్ లీడ్ గా హర్షాలీ మల్హోత్రా నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు మూవీ. రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.

తేజస్విని నందమూరి సమర్పిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. అఖండ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ అఖండ 2పై మరింత భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే అఖండ బ్లాక్‌బస్టర్ గా చరిత్ర సృష్టించగా, ఈసారి బోయపాటి–బాలయ్య కాంబినేషన్ “తాండవం” పేరిట మరింత భారీగా దాడి చేయబోతోందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

, , , ,
You may also like
Latest Posts from