ప్రశాంత్ వర్మ… డైరక్ట్ చేసిన ‘హనుమాన్ ‘ సినిమా ఫ్యాన్ ఇండియా లెవిల్లో ఒక సెపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసింది. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తే ఇక ప్రశాంత్ వర్మ సైతం చాలా తక్కువ బడ్జెట్ లోనే బెస్ట్ ఔట్ పుట్ ను తీసుకువచ్చి సూపర్ సక్సెస్ గా నిలపాడని అందరూ మెచ్చుకున్నారు.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞను కూడా ప్రశాంత్ వర్మ చేతిల మీదుగానే ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మ కూడా మోక్షజ్ఞ ను ఏ రేంజ్ లో చూపించాలి అనే దానిమీద తీవ్రమైన కసరత్తులు చేసి ఒక మంచి కథను కూడా రెడీ చేశాడు. ఆ మధ్యన సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా చేశారు. అయినప్పటికి ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకి అయితే వెళ్లడం లేదు. ఈ నేపధ్యంలో ప్రశాంత్ వర్మ బాలయ్య బాబుకు మధ్య గొడవ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి.
మోక్షజ్ఞ విషయంలో బాలయ్య బాబు చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తో స్క్రిప్టు విషయంలో తాను చెప్పిన కరెక్షన్స్ కు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదని బాలయ్య కోప్పడినట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మోక్షజ్ఞ సైతం ఆ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మోక్షజ్ఞ ఏ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మాస్ హీరోగా ఎదుగుతాడు? వేచి చూడాల్సిన అంశం.