నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి అప్‌డేట్స్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ సినిమాని ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్‌గా సంయుక్తా మీనన్‌(Samyuktha Menon) ఎంపికయ్యారు. ఈ విషయాన్ని టీమ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఈ సినిమాలో కీలకమైన పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీమ్ ..సంజయ్ దత్ తో మాట్లాడటం జరిగిందని, ఆయన ఓకే చేసాడని అంటున్నారు.

ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మహా కుంభమేళాలో జరిగింది. సినిమాలోని కీలక సీన్స్‌ షూట్‌ చేసారు.

బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. చిత్రానికి కెమేరా: సి. రాంప్రసాద్, సంతోష్‌ డి.

, , ,
You may also like
Latest Posts from