ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం స్పిరిట్.. ఈ సినిమాకి డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. స్పిరిట్ సినిమా షూటింగ్ జులై నెలలో ప్రారంభం కానుంది. దీంతో సినిమాలోని నటీనటుల కోసం సందీప్ రెడ్డి వెతుకులాట మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తన అనుంబంధ ప్రొడక్షన్ సంస్థ అయిన భద్రకాళీ పిక్చర్స్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో నటీనటులు కావాలని ఎక్స్ లో షేర్ చేశాడు.

స్పిరిట్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని ఆసక్తిగల నటీనటులు సంప్రదించాలని తెలియజేశారు.

ముందుగా 2 ఫోటోలు, 2 నిమిషాల ఇంట్రడక్షన్ వీడియోలని రికార్డ్ చేసి పంపించాలని ఈ మెయిల్ (spirit.bhadrakalipictures@gmail.com) కి కోరారు.
ఎంపికైన వారిని ఆడిషన్ కి పిలుస్తామని తెలిపారు. ఆసక్తి ఉంటే మీ ఫోటోలు, వీడియోలు పంపించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

సందీప్ రెడ్డి సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసాడు. అంతేకాదు మ్యూజిక్ పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్లు సమాచారం.

, ,
You may also like
Latest Posts from