శంభాజీ మహారాజ్ వీరగాథగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ (Chhaava). రీసెంట్ గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ రోజు నుంచి ( ఏప్రిల్ 11) నుంచి అందుబాటులో ఉండనుంది. ఈవిషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ విడుదల చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక (Rashmika) జీవించేశారు.
ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుందీ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
‘‘నా చావు ప్రతి మరాఠా ఇంట్లో.. ఒక శివాజీని, శంభాజీని పుట్టిస్తుంది. కానీ నీ చావు మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది’’ అంటూ ఇటీవలే బాక్సాఫీసుపై శంభాజీ మహరాజ్‌గా దండెత్తి భారీ వసూళ్లు సొంతం చేసుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు విక్కీ కౌశల్.
చిత్రం: ‘ఛావా’
నటీనటులు: విక్కీ కౌశల్, రష్మిక
విడుదల ఎప్పుడు: శుక్రవారం
ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్