మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఒక కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ గా నయనతార (Nayanthara) నటించనున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయా వార్తలను నిజం చేస్తూ తాజాగా టీమ్‌ హీరోయిన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారని చెప్పింది. ఒక ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేసింది.

వీడియో చివర్లో చిరంజీవి మేనరిజంలో ‘‘హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్‌ టర్నింగ్‌ ఇచ్చుకోమ్మా ’’ అంటూ ఆమె చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. టీమ్‌లోకి ఆమెను స్వాగతిస్తూ చిరు సైతం పోస్టు పెట్టారు. హ్యాట్రిక్‌ మూవీకి స్వాగతం. ఆమెతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.

‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్‌ ఫాదర్‌’ తర్వాత చిరు – నయన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. తనదైన మార్క్‌ కామెడీ, యాక్షన్‌తో అనిల్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాహు గారపాటి, చిరంజీవి తనయ సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు.. ఇందులో తన అసలు పేరుతో (శంకర్‌ వరప్రసాద్‌ పాత్రలో) నటించనున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ లు కనిపించే అవకాశం ఉందని ఓ పాత్ర కోసం అదితిరావు హైదరిని సంప్రదించారని సమాచారం.

భీమ్స్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. #Mega 157 (మెగా 157), #ChiruAnil (చిరు అనిల్‌) వర్కింగ్‌ టైటిల్స్‌. మరోవైపు, ‘విశ్వంభర’లో నటిస్తున్న చిరంజీవి.. ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

, , ,
You may also like
Latest Posts from