రిలీజ్‌కి ముందే వసూళ్ల రికార్డుల్ని బ్రద్దలు కొడుతూ, “కూలీ” సినిమా ఇప్పుడు టాక్ టౌన్ ఆఫ్ ది టౌన్‌గా మారింది! రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు వర్షన్ ఓవర్సీస్‌లో భారీ క్రేజ్ తో దుమారం రేపుతోంది.
ఇటీవలే విడుదలైన పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన “హరి హర వీర మల్లూ” మరియు ఎన్టీఆర్ హీరోగా వచ్చే “వార్ 2” సినిమాలు కూడా భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే, ఈ రెండు స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతూ “కూలీ” తెలుగు వర్షన్ ఓవర్సీస్‌లో ప్రీ-సేల్స్ పరంగా అతి పెద్ద ఓపెనింగ్స్ వస్తున్నాయి.
హరి హర వీర మల్లూ ఓవర్సీస్‌లో సుమారు 1.2 మిలియన్ల కలెక్షన్స్ సాధించగా, War 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం 1 మిలియన్ ఓపెనింగ్స్ కంటే తక్కువగా ట్రెండ్ అవుతుంది. కానీ “కూలీ” తెలుగు వర్షన్ ఓవర్సీస్‌లో అంచనా వేస్తే సుమారు 1.3 మిలియన్ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అవుతుంది అని తెలుస్తోంది.
దీంతో, ఐదేళ్ల పాటు ఫ్లోర్‌ల మీద ఉండటం, దర్శకుల మార్పులు, అనేక సార్లు వాయిదా పడటం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న హరి హర వీర మల్లూ, మరియు పూర్తిగా బాలీవుడ్ స్టైల్ చిత్రం అయిన War 2 కంటే కూడా “కూలీ” ఓవెనింగ్స్‌లో మెరుగ్గా రికార్డులు బద్దలు కొడుతోంది.
అంతేగాక, ఈ క్రేజ్ చూస్తుంటే “కూలీ” మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మరోసారి బద్దలు కొట్టబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు!