నందమూరి నటసింహం బాలకృష్ణ ‘డాకు మహారాజ్’తో థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తోందని అంచనా వేసారు. అయితే సంక్రాంతి కు వస్తున్నాం రాకముందు వరకూ ఈ సినిమా పరిస్దితి అలాగే ఉంది. అయితే ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అటు వెళ్లి పోవటంతో డాకూ కు కలెక్షన్స్ డ్రాప్ స్టార్టైంది.
మొదట ఉన్న ఊపు చూసి అందరూ డాకూ మహారాజ్ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి ఈజిగా ప్రవేశిస్తుందని అంచనా వేసారు. అయితే ఇప్పటిదాకా 74 కోట్లు షేర్ మాత్రమే వచ్చిందని సమాచారం. దాంతో వంద కోట్ల క్లబ్ లోకి వెళ్లటానికి మరో వారం పట్టేటట్లు ఉంది. ఈ రోజు నూన్ షోల ట్రెండ్ ని బట్టి…80 కోట్ల షేర్ దగ్గర సినిమా ఆగిపోతుందని అంచనా వేస్తున్నారు.
మరో ప్రక్క ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని, . ఇప్పటివరకూ రూ.156 కోట్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
అటు ఓవర్సీస్లోనూ బాలయ్య హవా కొనసాగుతోందని చెప్తున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. సినిమా విషయానికొస్తే, ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ బాబీ కొల్లి దీన్ని తెరకెక్కించారు.
ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలో కనిపించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ ఈ సినిమా నిర్మించారు.