సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న “స్పిరిట్” చిత్రం ఇప్పుడే ప్రారంభం కానప్పటికీ, వివాదాలు మాత్రం ముందుగానే షురూ అయ్యాయి! తాజా బాలీవుడ్ సమచారం ప్రకారం — దీపిక పదుకొణె ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పించబడిందని వినిపిస్తోంది.

స్టార్‌ హీరోయిన్ దీపికను తీసేసినందుకు కారణం? ఆమె వర్కింగ్ స్టైల్!

సెట్లో డిమాండ్లు, అనవసర టెర్మ్స్, యూనిట్‌కి అడ్జెస్ట్ కావడం లేదు అన్నది దర్శకుడు సందీప్ వంగా ఫీలయ్యారట. వర్క్ ఓరియెంటెడ్ దర్శకుడిగా ఫేమస్ అయిన వంగా, ఇలాంటి అన్‌ప్రొఫెషనల్ అటిట్యూడ్‌ని సహించలేదంట. అందుకే… తన స్టాండర్డ్స్‌కు తగ్గ హీరోయిన్ కోసం ఆయన వెతకడం స్టార్ట్ చేశాడట.

దీపికకు ఇప్పటికే హయ్యెస్ట్ పే చెక్ ఫిక్స్ అయ్యిందని, కానీ స్క్రిప్ట్ డిమాండ్ చేసిన డెడికేషన్ మాత్రం ఆమె నుంచి రాలేదన్నదే దర్శకుడి అభిప్రాయమట. “బాలీవుడ్ స్టార్స్‌కి అంత ఓవరైతే అవసరమా?” అనే చర్చ ఫిల్మ్ వర్గాల్లో ఊపందుకుంటోంది.

ఇక మరో కోణం చూస్తే, దీపిక పదుకొణె ఇటీవలే తల్లి అయ్యింది. దాంతో కుటుంబానికి ఎక్కువ టైం ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం. కొన్ని ఫిక్స్ చేసిన టైమ్‌లు, ప్రత్యేకంగా కోరిన ఫెసిలిటీస్ వల్ల దర్శకుడు అసౌకర్యంగా ఫీలయ్యారట.

ఇంతకీ, దీపిక స్థానంలో ఎవరు వస్తారు? మరో బిగ్ హీరోయిన్ ఫిక్స్ అవుతుందా? లేక కొత్త ముద్దుగుమ్మకు అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తికర అంశం.

మరోవైపు ప్రభాస్ స్పిరిట్ సెట్స్‌కి ఎప్పుడు ఎంటర్ అవుతాడన్నదే పెద్ద ప్రశ్న. ఇంకా షూటింగ్ స్టార్ట్ కూడా కాలేదంటేనే ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఈ స్థాయిలో హీట్ ఉందంటే, సినిమా సెట్స్‌పైకి వచ్చాక ఇంకెంలా ఉంటుందో వేచి చూడాలి!

, , ,
You may also like
Latest Posts from