పవన్ కళ్యాణ్ అంటేనే USA మార్కెట్‌లో ఓ సూపర్ బ్రాండ్. ఆయన సినిమా వస్తుందంటేనే అక్కడ ఫ్యాన్స్ జోష్ మీదకు వచ్చేస్తారు. ‘అత్తారింటికి దారేది’, ‘గబ్బర్ సింగ్’, ‘వకీల్ సాబ్’… ఇలా పవన్ సినిమాలకు US ప్రీమియర్ షోలు అద్భుతంగా ఆడినవే. కానీ ఈసారి మాత్రం ఓ అంచనాలు తలకిందులయ్యాయి. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీర మల్లు: Sword vs. Spirit (Part 1) కి USలో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా తక్కువగా లో లెవెల్లో ఉన్నాయి.
7 రోజులు మాత్రమే మిగిలినా… బుకింగ్స్ కేవలం $200K?!
ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే సెన్సార్ పూర్తయింది, U/A రేటింగ్‌తో 162 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. కానీ ప్రమోషన్స్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఆదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంటుందన్న టాక్ వున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ రేటు దారుణంగా పడిపోయింది.
ప్రస్తుతం US బుకింగ్స్ కేవలం $200K వద్దే ఉన్నాయి. ఈ సినిమా మొదట $1.5 మిలియన్ ఓపెనింగ్స్ సాధిస్తుందని టాక్ ఉండగా, ఇప్పుడు చూస్తుంటే 1 మిలియన్ డాలర్లకు కూడా చేరుతుందో లేదో అనుమానమే!
మల్టిపుల్ డిలేస్, డైరెక్టర్ మార్పు… ప్రమోషన్స్ గల్లంతు!
హరిహర వీర మల్లుకు ఎదురైనా ప్రధాన సమస్యలే ప్రస్తుతం బజ్‌ను చంపేశాయి. అసలే ఎన్నో సార్లు పోస్ట్‌పోన్ అయిన సినిమా కావటం, డైరెక్టర్ మారిన తర్వాత జ్యోతికృష్ణ మీద నమ్మకం రాకపోవటం దెబ్బ కొట్టాయి. దానికి తోడు పాటలకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు వచ్చి ప్రమోషన్స్ ఫుల్ స్కేల్‌లో చేయలేకపోతున్నారు. ఈ కారణాలన్నీ కలిసిపోయి సినిమాపై హైప్‌ను దెబ్బతీశాయి. దీంతో USలో పవన్ ఫ్యాన్స్ భారీగా ఉన్నా, అడ్వాన్స్ ట్రెండ్ మాత్రం నిరాశపరిచేలా మారింది.
ఒక్క హోప్ – పవన్ కళ్యాణ్ బ్రాండ్ పవర్!
అన్ని మైనసుల మధ్యన కూడా ఓ ప్లస్ మాత్రం ఉంది – పవన్ కళ్యాణ్ స్టార్ డమ్. ఈ చివరి వారం లోపు మాస్ ప్రమోషన్ చేసి, పవన్ పవర్ మీద ఓ బజ్ క్రియేట్ చేస్తే… ఇంకేమైనా రికవరీ పాస్‌బుల్. లేదంటే ఈ పీరియడ్ యాక్షన్ ఫిల్మ్‌కు US మార్కెట్‌లో పెద్ద షాక్ తప్పదు. ఇక ఇతర భాషల్లో అయితే అసలు హైప్ లేదనే చెప్పాలి.
ఇప్పుడు లాస్ట్ చాన్స్
ఈ వారం ‘హరిహర వీర మల్లు’ టీమ్ హడావుడి చేయకపోతే… ఈ అవకాశాన్ని మిస్సవ్వడం ఖాయం. పవన్ కళ్యాణ్‌ను మిస్సవ్వడానికి US ఆడియన్స్ రెడీగా లేరు – కానీ టీమ్ రెడీగా ఉందా అనేది అసలైన ప్రశ్న!