పెద్ద హీరోల సినిమాలకు ఫేక్ రికార్డ్ కలెక్షన్స్ కామన్ అయ్యిపోయాయి. ఒకళ్లను మించి మరొకరు ఈ రికార్జ్ లు ప్రకటిస్తూంటారు. వాటిని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం పొందుతూంటారు. అయితే అవి అభిమానుల కోసం, తమ సినిమా ఇంత ఆడింది, అంత ఆడింది అని చెప్పుకోవటం దాకా ఓకే కానీ అవే పోస్టర్స్ లు ఇప్పుటు ఐటీ రైట్స్ కు దారి తీస్తూండటంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.

రీసెంట్ గా పుష్ప 2, సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా క‌ల‌క్ష‌న్ల‌ను పోస్ట‌ర్ల రూపంలో ప్ర‌కటించుకొన్న నిర్మాత‌ల‌పై ఐటీ రైడ్స్ జ‌రిగాయి.

మైత్రీ మూవీస్ నిర్మాత‌ల‌తో పాటు, దిల్ రాజుని ఐటీ అధికారులు రోజుల త‌ర‌బ‌డి ప్ర‌శ్నించారు. కీల‌క‌మైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకొన్నారు. దీనిపై ఐటీ శాఖ లోతుగా విచార‌ణ జ‌రుపుతోంది. ఇది నిర్మాతలను కంగారు పెడుతోంది.

ఈ రైడ్స్ త‌ర‌వాత క‌ల‌క్ష‌న్ల పోస్ట‌ర్ల‌కు చెక్ ప‌డ‌బోతోందా? అనే ప్ర‌శ్న‌కు దిల్ రాజు స‌మాధానం ఇచ్చారు. ఇది వ్య‌క్తిగ‌తంగా తీసుకోవాల్సిన నిర్ణ‌యం కాద‌ని, ఛాంబ‌ర్ కూర్చుని మాట్లాడుకోవాల‌ని అన్నారు. అంటే త్వరలో ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ కు మంగళం పాడే అవకాసం కనపడుతోంది. అలా చేస్తే ఫ్యాన్స్ మ‌ధ్య కూడా వార్ త‌గ్గుతుంది.

You may also like
Latest Posts from