కిరణ్ అబ్బవరం కెరీర్ మొదటి నుంచి నత్త నడక నడుస్తూనే ఉంది. కెరీర్ ప్రారంభంలో వచ్చిన హిట్ తప్పించి చెప్పుకునేందుకు ఏమీ లేవు. అయితే రీసెంట్ గా క’లాంటి బ్లాక్ బస్టర్ వచ్చి తెరిపిన పడ్డాడు. దాంతో క చిత్రం తర్వాత కిరణ్ అబ్బవరం (kiran Abbavaram) నుంచి వచ్చిన చిత్రం ‘దిల్ రూబా’. వాస్తవానికి ‘క’ కంటే ముందే ఈ చిత్రం రావాల్సింది. కానీ కొన్ని కారణాలతో ఆసల్యంగా థియేటర్స్కి వచ్చింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయనే విషయం కిరణ్కి కూడా తెలుసు.
అందుకే ‘దిల్ రూబా’ (Dilruba Review) విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టాడు. కొన్ని సీన్లను రీషూట్ కూడా చేసినట్లు సమచారం. పబ్లిసిటీ విషయంలోనూ కిరణ్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే..చితక్కొట్టండి’ అని నిర్మాత సవాల్ విసరడం, అది నెట్టింట బాగా వైరల్ కావడంతో ‘దిల్ రూబా’పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉందా? లేదనే చెప్పాలి. కిరణ్ అబ్బవరం కెరీర్ ని ఇంకాస్త వెనక్కి లాగే పరిస్దితికి తీసుకొచ్చింది.
దిల్రూబా సినిమా రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 2, 3 రోజుల ముందే బుకింగ్స్ ప్రారంభించారు. కానీ, కిరణ్ అబ్బవరం సినీ కెరీర్లో ట్రెండ్ సెట్ చేసిన క మూవీ తర్వాత ఆ రేంజ్లో జోరు లేదు. క, వినరో భాగ్యము విష్ణు కథ, ఎస్ఆర్ కల్యాణ మండపం వంటి సినిమాలతో పోలిస్తే దిల్రూబా కలెక్షన్స్ ఘోరంగానే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో దిల్రూబా ఓపెనింగ్స్ రూ. 70 నుంచి 80 లక్షల రేంజ్లో ఉండే అవకాశం ఉన్నాయని, ఈ రోజు కూడా పికప్ కాలేదని అంటున్నారు. దిల్రూబా ఓపెనింగ్ కలెక్షన్స్ తగ్గడానికి కారణం నాని, ప్రియదర్శిల కోర్ట్ మంచి బజ్ క్రియేట్ చేయడం అని తెలుస్తోంది. తనకు పోటీగా వచ్చిన కోర్ట్ మూవీకి కలెక్షన్స్ బాగుంటున్నాయి.
అలాగే, మరోవైపు రష్మిక మందన్నా ఛావా కూడా తెలుగులో ఆడటంతో కొంతమంది ఆడియెన్స్ అటువైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో దిల్రూబా డే 1 కలెక్షన్స్ దారుణంగా ఉన్నట్లు సమాచారం.