ప్రఖ్యాత దర్శకులు రాజ్ అండ్ డీకే (Raj & DK) రూపొందిస్తున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సీరిస్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే మొదటి రెండు సీజన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ లో రెండో సీజన్‌కు సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు మూడో సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే, ఈ నేపథ్యంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 3’లో ప్రధాన పాత్రలో నటిస్తున్న అస్సామీ యాక్టర్ రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద మృతిచెందాడు.

వివరాల ప్రకారం, ఏప్రిల్ 27న రోహిత్ తొమ్మిది మంది స్నేహితులతో కలిసి ఒక వాటర్ ఫాల్స్‌కు వెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడని అతని స్నేహితులు పోలీసులకు తెలియజేశారు.

సాయంత్రం నాలుగు గంటలకు వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 4.30కి SDRF (State Disaster Response Force) బృందం సంఘటనాస్థలికి చేరుకుంది. చివరికి సాయంత్రం 6.30కి రోహిత్ మృతదేహాన్ని వెలికితీశారు.

ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు మృతిగా భావించినప్పటికీ, రోహిత్ కుటుంబ సభ్యులు హత్య అని అనుమానాం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, మరింత విచారణ ప్రారంభించారు. పూర్తి సత్యం కోసం పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

,
You may also like
Latest Posts from