‘సూపర్‌స్టార్’ రజనీకాంత్, ‘లోకేష్ కనగరాజ్’ కాంబినేషన్‌లో వస్తోందన్న వార్త బయటికి రావడంతోనే ‘కూలీ’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. లోకేష్ గతంలో చేసిన ‘ఖైది, మాస్టర్, విక్రమ్, లియో’ సినిమాలు అతనికి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ తెచ్చిపెట్టాయి. యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్స్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో, రజనీతో ఆయన జోడీ కలిస్తే బాక్సాఫీస్ శిఖరం తాకుతుందన్న నమ్మకం అందరిలో నెలకొంది.

అంచనాలకు తగ్గట్టే రిలీజ్‌కి ముందు సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ బలహీనంగా ఉందని ప్రేక్షకులు, విమర్శకులు చెబుతున్నారు.

ఓపెనింగ్ వీకెండ్‌లోనే రికార్డు స్థాయిలో రూ.380 కోట్లు గ్రాస్ వసూలు చేసినా, వర్కింగ్ డే వచ్చేసరికి కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. తాజాగా వరల్డ్‌వైడ్‌గా కేవలం రూ.20 కోట్లకు కూడా తక్కువ గ్రాస్ వసూలు అవుతుందన్న అంచనాలు వస్తున్నాయి. రాత్రి షోలు కూడా అదే స్థాయిలో కొనసాగితే ఈ డౌన్‌ఫాల్ మరింత క్లియర్ అవుతుంది.

ఇక ఈ ట్రెండ్ కొనసాగితే రూ.500 కోట్ల మార్క్ చేరుకోవడమే కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ.600 కోట్ల వద్ద ఉండటంతో, కలెక్షన్లు ఈ స్థాయిలోనే ఉంటే ‘కూలీ’ సినిమా లోకేష్ కనగరాజ్ కెరీర్‌లో తొలి బాక్సాఫీస్ వైఫల్యమవుతుందనే ఆందోళన మొదలైంది.

, , , , , , ,
You may also like
Latest Posts from