గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ పొలిటికల్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’ ఓటిటిలో అడుగు పెట్టడానికి రంగం సిద్దమైంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై మెగా అభిమానులు సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి రాబోతుందనే సమాచారం వచ్చేసింది.
2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
‘గేమ్ ఛేంజర్’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 50 శాతం కలెక్షన్లను కూడా రాబట్టలేకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది.
‘గేమ్ ఛేంజర్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
ఫిబ్రవరి 14న ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మూవీ హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.