పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఎట్టకేలకు తన ప్రయాణంలో కీలక మైలురాయి దాటింది. సినిమా ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. U/A సర్టిఫికెట్‌తో పాటు, సినిమా 162 నిమిషాల రన్ టైం తో థియేటర్లకు సిద్ధమవుతోంది.

బిజినెస్ హీట్‌లో హరి హర వీరమల్లు

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా చివరి దశకు చేరుకుంది. కొన్ని ఏరియాల్లో నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేయడానికి ముందుకొస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో బయ్యర్లకు ఇప్పటికే డీల్స్ ఫిక్స్ అయ్యాయి. ముఖ్యంగా నైజాం లాంటి కీలక సెక్టార్‌లో మేకర్స్ డైరెక్ట్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. Exhibitors నుంచి మంచి అడ్వాన్సులు వస్తాయని అంచనా.

ఒకటే హర్డిల్ – డిస్ట్రిబ్యూటర్లు పేమెంట్ ఆలస్యం

మూవీని కొనుగోలు చేసిన కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఇంకా అడ్వాన్స్ పేమెంట్స్ పూర్తి చేయలేదు. ఇదే ప్రస్తుతం ఉన్న ఒకే పెద్ద ఇబ్బంది. అయితే, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇవన్నీ రిలీజ్ కు ముందే క్లియర్ కావొచ్చని తెలుస్తోంది.

ప్రమోషన్లతో పవర్ స్టార్ట్

సినిమా టీమ్ ఇప్పుడు ప్రోమోషన్ మోడ్‌కి మారుతోంది. కొత్తగా ఒక మేకింగ్ వీడియో తో పాటు పాట విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా త్వరలో జరగనుంది. పవన్ కల్యాణ్, క్రిష్ టీమ్‌తో ఇంటర్వ్యూలు కూడా లైన్‌లో ఉన్నాయి.

ఇంకా క్లారిటీ కావాల్సిన విషయాలన్నీ రేపట్లోగా తేలిపోతాయన్నది టాక్. ఈసారి మాత్రం వాయిదా అనే మాటే ఉండదట!

పవన్ కళ్యాణ్ తొలిసారిగా చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో, హరి హర వీరమల్లుపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఫ్యాన్స్ అండ్ ట్రేడ్ సర్కిల్స్ మాత్రం సినిమా ఏ మాత్రం తగ్గదనే కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు.

పవర్ స్టార్ మాస్స్ సాల్ట్ కు హిస్టారికల్ ఫ్లేవర్ కలిపితే ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే!

, , , , , ,
You may also like
Latest Posts from