ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తిరిగి సినిమా ట్రాక్ లోకి వచ్చి వదిలేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. అలా కంప్లీట్ చేయాల్సిన సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)ని ముందుకు తీసుకొచ్చారు.
ప్రముఖ దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా.. అటు తర్వాత ఏ.ఎం.రత్నం (AM Rathnam) తనయుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna చేతుల్లోకి వెళ్లింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం పవన్ కల్యాణ్ ఓ పాట పాడితే ఆ పాటను రిలీజ్ చేసారు.
https://www.youtube.com/watch?v=y4Rp45vN2O0
ఈ పాట విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 36 సెకన్ల నిడివి కలిగి ఉంది.’మాట వినాలి గురుడా మాట వినాలి..’ (Maata Vinaali ) ‘మాట దాటిపోతే మర్మము తెలియకపోతే.. పొగరుబోతు తగరు పోయి కొండను తాకినట్టు’ అంటూ వచ్చే లిరిక్స్ తో ఈ పాట సాగింది.
ఈ పాట ఆకట్టుకునే విధంగానే కాదు.. ఆలోచించే విధంగా కూడా ఉన్నాయి. అయితే మరికొంతమంది అయితే అది బ్యాడ్ ఛాయిస్ అని తేలుస్తున్నారు. పవన్ అభిమానులకు ఇలాంటి నచ్చుతాయా అనే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని..పెంచల్ దాస్ ఈ లిరిక్స్ రాసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఆ లిరిక్స్ ను పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుని ఆలపించారు అనిపిస్తుంది.
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) సమకూర్చిన ట్యూన్ కొత్తగా ఏమీ లేకపోయినా.. లిరిక్స్ కి తగ్గట్టు ఉంది. బాగానే సెట్ అయ్యింది అని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (OG Movie) తో సమానంగా ఈ చిత్రాన్ని కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధమయ్యారు. రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ సినిమా మొదటి భాగం 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.