తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అన్ని భాషల సినిమాలను ఎంకరేజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే చాలా సార్లు మన దగ్గర తెలుగు సినిమాల కంటే వేరే భాషల సినిమాలు సూపర్‌హిట్స్ అవుతూంటాయి. కానీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం మన సినిమాలకు అలాంటి సపోర్ట్ దొరకడం లేదు. ముఖ్యంగా కర్ణాటకలో తెలుగు సినిమాలను అడ్డుకుంటున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. పుష్ప 2, హరిహర వీరమల్లు, OG వంటి సినిమాలపై టైటిల్‌ వివాదాలు పెట్టి ఆపిన సంగతే తెలిసిందే.

అయినా ఆ ఇష్యూలపై మన తెలుగు సెలబ్రిటీలు కానీ, కన్నడ సెలబ్రిటీలు కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. ఈ మధ్య OG సినిమాకు కూడా కర్ణాటకలో ఇలాగే అడ్డంకులు ఎదురుకావడంతో తెలుగు సినిమా లవర్స్ మండిపడుతున్నారు. దీంతోనే వీరి కోపం త్వరలో రిలీజ్ కానున్న కాంతార: చాప్టర్ 1పై పడింది. ట్విట్టర్, యూట్యూబ్‌లో #BoycottKantara ట్రెండ్ అవుతోంది.

ఇంతలో హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి స్టేజ్ మీదకి వచ్చి కనీసం ఇంగ్లీష్ కూడా కాకుండా పూర్తిగా కన్నడలోనే మాట్లాడేశాడు. ఫలితం — అక్కడున్న ఆడియన్స్‌కి, బయట ఫ్యాన్స్‌కి ఒక్కరికి కూడా అర్థం కాలేదు. దీంతో నెటిజన్లు మరింత ఫైర్ అవుతూ కామెంట్స్‌లో రగులుతున్నారు.

“మన మంగ్లీ తెలుగులో పాటలు పాడిందని కర్ణాటకలో దాడి చేస్తారు.. మా సినిమాలు అక్కడ ఆడనివ్వరు.. ఇక్కడికి వచ్చి మీరు తెలుగు మాట్లాడకపోవడం ఎంతవరకు కరెక్ట్?” అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు బాయ్‌కాట్ వాతావరణంలో రిషబ్ ఈ స్పీచ్ మరింత ఆగ్రహానికి కారణమైంది. మరి దీనిపై రిషబ్ శెట్టి ఎప్పుడైనా స్పందిస్తాడా? లేక ఇదే వివాదం కాంతార 1 రిలీజ్‌పై ప్రభావం చూపుతుందా?

, , , ,
You may also like
Latest Posts from