టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన గాసిప్ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ‘పుష్ప: ది రైజ్’తో పాన్-ఇండియన్ ఇమేజ్ సంపాదించిన అల్లు అర్జున్, ఇప్పుడు పాన్-వరల్డ్ స్టార్‌గా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం టాప్ డైరెక్టర్‌తో కలిసి పని చేస్తున్నాడు. ఆ సినిమా 2027లో విడుదల కానుంది.

ఇంతలోనే బన్నీ టీమ్‌ మరో ప్రాజెక్ట్ కోసం ఇద్దరు హాట్‌ డైరెక్టర్లను సంప్రదించిందట. వారిలో ఒకరు తెలుగు నుండి బాలీవుడ్‌కు వెళ్లి విజయాలు సాధించిన దర్శకుడు కాగా, మరొకరు సౌత్‌కి చెందినవారు కానీ ప్రస్తుతం టాప్ తెలుగు హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నారు.

అయితే షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు డైరెక్టర్లు బన్నీ ప్రాజెక్ట్‌ను నో చెప్పారట. కారణం ఒకటే – అల్లు అర్జున్ క్రియేటివ్ ఇన్‌వాల్వ్‌మెంట్. కథ, స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్‌లో హీరో జోక్యం ఎక్కువగా ఉంటుందని చెప్పి డైరెక్టర్లు వెనకడుగు వేసినట్టుగా టాక్ వినిపిస్తోంది.

ఇక బన్నీ మాత్రం బాలీవుడ్‌లో తన మార్కెట్‌ను పెంచుకోవాలని బాగా ఆసక్తి చూపుతున్నాడు. బీ-టౌన్‌లో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, టాప్ డైరెక్టర్లు వెనక్కి తగ్గడంతో ఇప్పుడు తన ఇమేజ్, మార్కెట్‌కి సరిపోయే బాలీవుడ్ డైరెక్టర్ కోసం వెతకడం మొదలుపెట్టాడట.

ఈ గాసిప్ నిజమా కాదా అన్నది స్పష్టంగా తెలియదు కానీ, ఫిల్మ్ సర్కిల్స్‌లో మాత్రం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

, , , , , ,
You may also like
Latest Posts from