1990 మే 9న విడుదలై తెలుగు సినీ చరిత్రలో అపూర్వ విజయాన్ని నమోదు చేసిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి, శ్రీదేవి జంటగా వచ్చిన గొప్ప ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పేరుగాంచింది. ఎడ్వెంచర్, ఫన్, యాక్షన్, లవ్, సాంగ్స్ ఇలా —all in one package. అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు, 35 ఏళ్ల తర్వాత అదే సినిమా కొత్త టెక్నాలజీతో, 8K 3D అప్‌గ్రేడ్ చేస్తూ మళ్ళీ థియేటర్లలో విడుదలైంది.
భారీ రీమాస్టరింగ్ ఖర్చులు, భారీ మార్కెటింగ్ హైప్—జగదేక వీరుడు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందనే ఆశలు రేపాయి. అయితే ఈ భారీ అంచనాల మధ్య నిజంగా నిలబడిందా, ఏం జరిగింది?
నిర్మాత అశ్వనీదత్ సహా వైజయంతీ మూవీస్ భారీ పెట్టుబడి పెట్టి ఈ క్లాసిక్ చిత్రాన్ని 8Kలో అప్‌గ్రేడ్ చేసి, 3Dలో విడుదల చేశారు. ఇది తెలుగు సినిమా రంగంలో ఒక పెద్ద ప్రయోగం. కానీ మొదటి నాలుగు రోజుల్లో మాత్రం షేర్ కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే వవచ్చిందని చెప్తున్నారు. అదే నిజమైతే మాత్రం షాకింగే.
రీరిలీజ్ ప్రింట్ సరిగ్గా లేదని, చాలా చోట్ల బ్లర్ గా ఉందని సోషల్ మీడియాలో ఈ రీ రిలీజ్ చిత్రంపై తీవ్ర అసంతృప్తి, రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ వాస్తవానికి క్లాసిక్ సినీ ప్రేమికులకు అందమైన జ్ఞాపకంగా నిలవాలనేది నిర్మాతల ఆశ. కానీ ఇప్పుడు ఈ సినిమా కొంత మంది అభిమానుల గుండెల్లో కలవరానికీ, సోషల్ మీడియాలో చర్చలకు కారణమవుతోంది.
అయితే అదే సమయంలో ఈ సినిమాకు ఇప్పటి వరకు మొత్తంగా 18.35 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఏది నిజం..ఏది అబద్దం అనేది తేలాల్సి ఉంది.