బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ హిట్ చిత్రం డాకు మహారాజ్కి ముందు, ఆయనకు ఎన్నో సాలిడ్ హిట్స్ ఉన్నాయి. వాటిలో భగవంత్ కేసరి కూడా ఒకటి, ఇది కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు, ఈ చిత్రం తమిళ స్టార్ హీరో విజయ్ జన నాయగన్తో రీమేక్ చేస్తున్నట్లు రూమర్లు బయటకు వచ్చాయి. అయితే కన్ఫర్మేషన్ టీమ్ ఇవ్వలేదు. కానీ ఓ లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన వారు భగవంత్ కేసరి రీమేక్ అని ధృవీకరిస్తున్నారు. ఇంతకీ ఏమిటా లీక్
తమిళ నటుడు విజయ్, జన నాయగన్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా విజయ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అడుగుపెట్టే ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే, ఈ సినిమా భగవంత్ కేశరీ రీమేక్ అని, కొంతవరకు స్క్రిప్ట్‌లో మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు, సోషల్ మీడియాలో లీక్ అయిన ఓ ఫోటో విశేషంగా చర్చకు వచ్చిన విషయం. ఫోటోలో విజయ్ పోలీస్ యూనిఫార్మ్‌లో కనిపిస్తూ, ఇది భగవంత్ కేసరీలో బాలకృష్ణ చేసిన పోలీస్ పాత్రతో సమానంగా ఉంది. దీని ద్వారా, జన నాయగన్ నిజంగా భగవంత్ కేసరీ రీమేక్‌గా ఉంటుందని మౌలికంగా నిర్ధారించబడింది అంటోంది తమిళ మీడియా.
ఈ లీక్ టీమ్‌కు కచ్చితంగా బాధను కలిగించిందనే చెప్పాలి. చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. జన నాయగన్ ను హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు, మరియు ఈ చిత్రం వచ్చే సంక్రాంతి పండగకి విడుదలకు రాబోతుంది.