సినిమా వాళ్ల వారసలు సినిమాల్లోకి రావటం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు కర్ణాటక రాజకీయ నేత గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘జూనియర్’ సినిమాతో తెలుగు, కన్నడలో ఒకేసారి హీరోగా అడుగుపెట్టాడు. మాస్-కమర్షియల్ డేబ్యూట్ కోసం ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సపోర్ట్‌గా నిలవడం, బాగా ఎస్టాబ్లిష్డ్ టెక్నికల్ టీంతో సినిమా రూపొందడం ఈ ప్రాజెక్ట్‌కి హైప్ తెచ్చింది.
మరి కిరీటి హీరోగా మెరిశాడా? సినిమా ఎలా ఉందో చూద్దాం.
స్టోరీ లైన్
కోదండపాణి (రవిచంద్రన్) దంపతులకు లేటు వయస్సులో పుడతాడు అభి (కిరీటి). పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయాడు. అందుకే తండ్రి కాస్త ఎక్కువ ప్రేమ చూపిస్తూ గారాబంగా పెంచుతూంటాడు. తమ మధ్య ఉన్న జెనరేషన్ గ్యాప్ ని, ఆయన అతి జాగ్రత్తతో కూడిన ప్రేమను తట్టుకోలేక మెల్లిమెల్లిగా దూరం జరుగుతూంటాడు. ఆయనకు దూరంగా ఉంటూనే ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభి, స్పూర్తి (శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె మొదట పట్టించుకోలేదు. తర్వాత మెల్లిగా ఇద్దరూ దగ్గరవుతాడు. ఓ ప్రాజెక్టు కలిసి పనిచేస్తాడు.
ఆ తర్వాత ఆమె పని చేసే కంపెనీలోనే జాబ్ సంపాదించి అక్కడ జాయిన్ అవుతాడు. అయితే అక్కడ జాబ్ లో అతనికి సమస్య విజయ (జెనీలియా) రూపంలో ఎదురౌతుంది. ఆమెకోపానికి గురి అవుతాడు. ఆ క్రమంలో ఆ కంపెనీ నుంచి బయిటకు వెళ్లిపోవాల్సిన సమయంలో అభి గురించి ఓ నిజం రివీల్ అయ్యి అందరినీ షాక్ కు గురి చేస్తుంది. అక్కడ నుంచి అతని జీవితం కొత్త టర్న్ తీసుకుంటుంది. ఇంతకీ ఆ నిజం ఏమిటి…అతని జీవితం ఎలా మారింది..అసలు అభి ఎవరు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
“సినిమాకు కథ అనే హృదయం ఉంటేనే అది మనసుని తాకుతుంది. కానీ ఇక్కడ ఉన్నది… ఓ ప్లాన్ చేసిన లాంచ్.”
కన్నడ రాజకీయ కుటుంబం నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కిరీటి డెబ్యూట్ ఫిల్మ్ ‘జూనియర్’ – స్పష్టంగా చెప్పాలంటే, ఇది ఓ స్టార్ లాంచ్ వెహికల్. ఆ పరంగా చూసుకుంటే, సినిమా తాను ఎంచుకున్న గమ్యాన్ని చేరినట్లే. ప్రేమికుడిగా, యాక్షన్ హీరోగా, సున్నితమైన భావోద్వేగాల మధ్య నడిచే యువకుడిగా… ఒక్క సినిమాలో కిరీటి భవిష్యత్ సినిమా హీరో కెరీర్ కు కావాల్సిన అన్ని షేడ్స్‌ను చూపించారు. అయితే అనుకున్న స్దాయిలో అవి ఎంగేజ్ చేయలేకపోయాయి. చెప్పుకోవటానికి ఎమోషనల్ గా అనిపించే సీన్స్ ఏమీ తెరపై వర్కవుట్ కాలేదు.
ఏదైనా బలమైన ఎమోషన్ లేదా మలుపు ఉంటే కథ నిలబడుతుంది. ఇక్కడ ఏ ఒక్క హైలైట్ కూడా పూర్తిగా మెమోరబుల్‌గా ఉండదు. ఈ సినిమా స్క్రిప్టు రాసిన విధానం చూస్తే, ఇది ప్రీ-పాండమిక్ సెన్సిబిలిటీతో ఉన్న స్క్రీన్‌ప్లే అన్న భావన వస్తుంది. ఒకే శైలిలో ప్రేమ, బాధ, విజయ లక్ష్యం, గ్రామ నేపథ్యం అన్నీ బలవంతంగా కలిపిన ఫీలింగ్. ప్రతి ట్విస్ట్, ప్రతి సన్నివేశం ముందే ఊహించేసుకోవచ్చు.ఎమోషనల్ డెప్త్ కు అవకాశం ఉన్నప్పటి రచన అంతగానూ డీప్ గా ఉండదు.
మరీ ముఖ్యంగా కథ ఎటునుంచి ఎక్కడికి పోతుంది అన్న స్పష్టత లేదు. అభి–స్ఫూర్తి లవ్ ట్రాక్ మునుపటి సినిమాల శైలిలోనే సాగుతుంది. ఎమోషనల్ కనెక్షన్‌తో కాకుండా, గ్లామర్–ఫన్ మిక్స్‌తో హీటింగ్ చేయడానికి ప్రయత్నించారు.ఒక్కో సంఘటన వస్తుంది, వెళ్తుంది. కాని వాటి మధ్య లింక్ బాగా వీక్ గా ఉంటుంది. జూనియర్ స్క్రీన్‌ప్లే ఒక బ్యాంక్ కు లోన్ కోసం ఇచ్చే ప్రెజెంటేషన్ లాగా ఉంది – అన్ని పాయింట్లు ఉన్నాయి, కాని ఎమోషన్ లేదు. జెనీలియా ప్లే చేసిన కార్పొరేట్ బాస్ పాత్ర మొదట ఆసక్తికరంగా అనిపించినా, వెంటనే ఓ ఫ్లాట్ మార్గంలోకి వెళ్తుంది.
టెక్నికల్ గా
టెక్నికల్ టీమ్ స్ట్రాంగ్… కాని స్పార్క్ కొరవడింది! దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ లాంటి టాప్ టెక్నీషియన్లు సినిమాకి పని చేయడం వల్ల, విజువల్స్, మ్యూజిక్ పరంగా ఫీలే వేరేగా ఉండాలి కానీ కొంతవరకే అది కనపడింది. ‘వైరల్ వయ్యారి’ లాంటి పాటలు స్క్రీన్ మీద హైలైట్‌గా నిలిచాయి. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి ఓ విజువల్ గ్రేస్ ఇచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలు తగ్గలేదు… సినిమాలో ఖర్చు కనిపిస్తుంది.
మాటలు & దర్శకత్వం విషయానికొస్తే…
కళ్యాణ్ చక్రవర్తి రాసిన డైలాగ్స్ కొన్ని సీన్స్‌లో బాగా “పేలాయ్”. ఎమోషన్ ఉన్న సన్నివేశాల్లో ఆ పంచ్ వర్కౌట్ అయింది. కానీ ఆConsistency మాత్రం throughout కనిపించదు. దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌ని కిరీటి ప్రెజెంటేషన్‌గా చూసినట్టు స్పష్టంగా తెలుస్తుంది.
ఫైనల్ థాట్
కథ కొత్తది కాదు. ట్రీట్‌మెంట్ లో వైవిధ్యం లేదు. కాని ఓ మినిమల్ లెవల్‌లో ఆడియెన్స్‌కి నిరాశ కలిగించదు కూడా. మీరు ఓల్డ్ స్కూల్ మాస్ ఎంటర్‌టైనర్స్‌కి ఫ్యాన్ అయితే, ఓసారి చూస్తే బాగానే అనిపిస్తుంది. కాకపోతే… అందులో మిగిలేది కిరీటి పర్ఫార్మెన్స్ మాత్రమే. సమకాలీన ప్రేక్షకుడి మైండ్‌సెట్‌ను పట్టుకోవాలంటే… ఫార్ములా కంటే నిజమైన ఫీలింగ్ ఎక్కువ అవసరం. ఆ లోటు ‘జూనియర్’కు స్పష్టంగా ఉంది.