మహేష్ నటించిన ‘వన్’ ఒక్కడినే తో తెలుగువారికి సుపరిచితమైన హీరోయిన్ కృతి సనన్. ఆమె ఆ తర్వాత ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో కనిపించింది. ముంబైలో ఉంటుంది. ఆమె ఉంటున్న ప్లాట్ ఎంత అద్దె చెల్లిస్తోందన్న విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. సక్సెస్ లో ఉన్న హీరోయిన్ కాబట్టి అంత అద్దె కట్టినా తప్పులేదని అంటున్నారు. ఇంతకీ ఆమె అద్దె ఎంత కడుతోంది.

అంతకు ముందు కృతి సననన్ అమితాబ్ కి చెందిన అంధేరిలోని డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ను కృతి ప్రస్తుతానికి అద్దెకు తీసుకుంది. అక్కడ నాలుగేళ్లగా ఉంటోంది. తాజాగా అక్కడ నుంచి మరో చోటకు తన అడ్డా మార్చింది.

కృతి సనన్ అఫీషియల్ గా తన ఇంటి ఎడ్రస్ ఛేంజ్ చేసింది. ముంబై బాంద్రాలోని సాధు పేలస్ కు ఆమె షిప్ట్ అయ్యింది. అక్కడ బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది ఉంటూంటారు. అదో విలావంతమైన ప్లేస్. సకల సౌకర్యాలు ఉండే ఈ ఇంటి అద్దె ఇప్పుడు ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

సాధు పేలస్ లోని ప్లాట్ కు కృతి షిప్ట్ అయ్యింది. ఈ ప్లాట్ ని ఆమె లీజుకు తీసుకుంది. నెలకు ఈ ప్లాట్ రెంట్ ₹16-17 లక్షల మధ్య ఉందిట. మెయింటినెన్స్ మరో లక్ష ఉంటుందని చెప్తున్నారు. టోటల్ గా 18 లక్షలు దాకా పే చేస్తోంది అన్నమాట.

కృతి సనన్ కట్టే అద్దె విషయం తెలిసిన చాలా మంది సోషల్ మీడియాలో ఈ విషయం షేర్ చేస్తూ మేము ఆమె ఓ నెలకు కట్టే అద్దెతో సొంత ఇల్లు కొనుక్కుంటాం అంటున్నారు.

ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్‌ సినిమాలో సీతాదేవి పాత్రలో నటించడం ద్వారా చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను వరుసగా చేస్తున్న కృతి సనన్ తాజాగా ‘దో పత్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘దో పత్తి’ సినిమాలో కృతి సనన్ అక్క చెల్లి పాత్రల్లో నటించింది. డ్యూయెల్‌ రోల్‌లో నటించడంతో పాటు స్వయంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది. అక్టోబర్‌లో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దో పత్తి సినిమాకు మంచి స్పందన దక్కింది. కృతి సనన్‌ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

నార్త్ కు చెందిన కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అనే సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘వన్ : నేనొక్కడినే’ వంటి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన ‘దోచేయ్’ మూవీతో అలరించింది. మళ్లీ కాస్తా గ్యాప్ తో రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వకపోయినా.. కృతి సనన్ సీత పాత్రలో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

,
You may also like
Latest Posts from