ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన తెరకెక్కిన చెరపకురా.. చెడేవు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యిన నటి పుష్పలత. ఆమె 87 ఏళ్ల పుష్పలత మంగళవారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళ సినిమా రంగంలో ఒక టైమ్ లో స్టార్ హీరోయిన్ గా లో ఒకరిగా నిలిచారు ఈమె. అలాగే కేవలం తమిళం మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మళయాళ పరిశ్రమలో వందకు పైగా సినిమాలలో నటించారు. పుష్పలత మృతి పట్ల చిత్ర పరిశ్రమలోని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ నటి పుష్పలత గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో

పుష్పలత తమిళ సినిమాలోని ప్రముఖ హీరోలైన ఎంజిఆర్, శివాజీ గణేషన్, జైశంకర్, జెమినీ గణేషన్ లతో కలిసి నటించారు.

ఎన్టీఆర్‌ హీరోగా కోవెలమూడి భాస్కర్‌ రావ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చెరపకురా.. చెడేవు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు పుష్పలత.

ఆ తర్వాత ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్త బంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్‌ రౌడీ, విక్రమ్‌ వంటి చిత్రాలలో నటించి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

పుష్పలతకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఒకరు నటి మహాలక్ష్మి. ఆమె తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. తెలుగులో రెండు జెళ్ల సీత, ఆనంద భైరవి, మాయదారి మరిది, రుణానుబంధం చిత్రాలలో నటించారు.

,
You may also like
Latest Posts from